ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డబ్బులిచ్చినా.. మాపేరిట పట్టాలు ఇవ్వడంలేదు

ABN, Publish Date - Jan 29 , 2024 | 11:43 PM

తమ ఆధీనం లో ఉన్న డీకేటీ భూములకు ప ట్టాలు ఇప్పి స్తామని డబ్బులు తీసుకున్నా ఇంత వరకు ఇవ్వడంలేదని బాధిత రైతు ఆర్డీవో మురళికి స్పందనలో ఫిర్యా దు చేశాడు.

స్పందనలో బాధిత రైతు ఆర్డీవోకు ఫిర్యాదు

మదనపల్లె టౌన, జనవరి 29:తమ ఆధీనం లో ఉన్న డీకేటీ భూములకు ప ట్టాలు ఇప్పి స్తామని డబ్బులు తీసుకున్నా ఇంత వరకు ఇవ్వడంలేదని బాధిత రైతు ఆర్డీవో మురళికి స్పందనలో ఫిర్యా దు చేశాడు. స్థానిక సబ్‌ కలెక్టరేట్‌లో నిర్వహిం చిన స్పందన కార్యక్ర మానికి అర్జీలు వెల్లువలా వచ్చాయి. ఈసం దర్భంగా నిమ్మనపల్లె మండలం పారేసువారిపల్లెకు చెందిన రైతు పారేసు లక్ష్మ య్య మాట్లాడుతూ నిమ్మనపల్లె మండలం బండ్లపై గ్రామంలో సర్వే నెంబర్‌లో బ్రమ రాంభపేరిట ఉన్న సర్వే నెంబర్‌ 435లో 2.58 ఎకరాలు డీకేటీ భూమి ఉందన్నారు. ఈ భూమిని తాము అనుభవించు కుంటున్నామని, దీనికి మా పేరిట డీకేటీ పట్టా మార్పు చేయాలని కోరితే అప్పటి ఆర్‌ఐ వీరాంజనేయులు, వీఆర్‌వో రాజగోపాల్‌ రూ.2.50లక్షలు ఖర్చు అవుతుందంటే తాను రూ.1.50లక్షలు నగదు ఇచ్చాన న్నారు. కాని వారిద్దరు బదిలీపై వెళ్లిపోయారని, తనకు న్యాయం చేయాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణం బీకేపల్లె సర్వే నెంబర్‌ 548లో గాంధీపురం, కుమారపురం దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కొందరు ఆక్రమించుకుంటున్నారని మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ తలారి రాధ, సీపీఐ పట్టణ కార్యదర్శి మురళి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. మండలంలోని కోళ్లబైలు, పొన్నేటిపాలెంకు వెళ్లే దారిలో నక్కలదిన్నె తాండాకు చెందిన గిరిజనులు సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్నామని నక్కలదిన్నె తాండా గిరిజనులు ఆర్డీవోకు విన్నవించుకున్నారు. సర్వే చేయించి దారి సమస్య పరిష్క రించాలని కోరారు.

Updated Date - Jan 29 , 2024 | 11:43 PM

Advertising
Advertising