ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రతిష్టాత్మకంగా పీలేరులో రా.. కదలి రా.. సభ

ABN, Publish Date - Jan 12 , 2024 | 11:49 PM

పీలేరులో జరుగనున్న రా.. కదలి రా.. బహిరంగ సభను ప్రతిష్టా త్మకంగా తీసుకుని విజయవంతం చేసేందు కు టీడీపీ శ్రేణులు కదలిరావాలని పీలేరు ఇనచార్జీ నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి

కలికిరి, జనవరి 12: పీలేరులో జరుగనున్న రా.. కదలి రా.. బహిరంగ సభను ప్రతిష్టా త్మకంగా తీసుకుని విజయవంతం చేసేందు కు టీడీపీ శ్రేణులు కదలిరావాలని పీలేరు ఇనచార్జీ నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి కోరారు. శుక్రవారం నగరిపల్లెలో జరిగిన కలికిరి మండల టీడీపీ విస్తృత సమావేశంలో ఈ నెల 24న నిర్వహించనున్న రా..కదలిరా.. సభపై టీడీపీ నాయకులతో ఆయన చర్చించారు. పీలేరు పరిసర సమీప మండలాల్లో కలికిరి కూడా ఒకటని, ఇక్కడి నుంచి మోటారు సైకిళ్ళు, ఆటోలు, కార్లను పూర్తి స్థాయిలో సమీకరించుకోవాలని చెప్పారు. ఉదయం 9 గంటలకు కలికిరి నుంచి సభకు బయలు దేరాలని చెప్పారు. సమావేశం అనంతరం పంచాయతీల వారీగా విడివిడిగా సమావేశమై లక్ష్యాలను నిర్దేశించారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు వాసునూరి చంద్రశేఖర్‌, కలికిరి సర్పంచు ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, పార్టీ నాయకులు నిజాముద్దీన, సతీష్‌ రెడ్డి, మర్రికుంటపల్లె, పత్తేగడ, గుండ్లూరు, మునేళ్ళపల్లె, సండ్రావారిపల్లె సర్పంచులు రెడ్డిరాము, యల్యయ్య, సైఫుల్లా, జాహీదా, ఎంపీటీసీలు కృష్ణయ్య, చిన్నరెడ్డెయ్యతోపాటు అన్ని అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising