గుర్రంకొండ ఏఎ్‌సఐపై కేసు నమోదు
ABN, Publish Date - Nov 17 , 2024 | 11:24 PM
గుర్రంకొండ ఏఎ్‌సఐ పి.మోసస్‌పై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు.
అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య ఫిర్యాదు
మదనపల్లె అర్బన్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): గుర్రంకొండ ఏఎ్‌సఐ పి.మోసస్‌పై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. ఆయన వివరాల మేరకు మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో కాపురం ఉంటున్న మోసస్‌కు 30 ఏళ్ల క్రితం కె.ఎస్తర్‌రాణి(55)తో వివాహమైంది. అయితే తన భర్త అదనపు కట్నం కోసం తనను మానసికంగా హింసిస్తున్నాడని ఆమె మదనపల్లె టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమారై ఉన్నారు.
Updated Date - Nov 17 , 2024 | 11:24 PM