ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సిద్ధం సభలో అన్నీ అబద్ధాలే: గంటా

ABN, Publish Date - Jan 29 , 2024 | 03:03 AM

సంగివలసలో ‘సిద్ధం’ పేరుతో వైసీపీ నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి జగన్‌ అన్నీ అబద్ధాలే చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని

విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): సంగివలసలో ‘సిద్ధం’ పేరుతో వైసీపీ నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి జగన్‌ అన్నీ అబద్ధాలే చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గడచిన నాలుగున్నరేళ్లలో ప్రజలకు కావల్సినవి అన్ని చేశానని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పనిచేయడానికి అదే ప్రజలు తన సైన్యంగా చెప్పుకోవడం చూస్తే జగన్‌లో భయం పట్టుకుందన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం జగన్‌ ఇష్టపడడం లేదని విషయం ఆయన మాటల ద్వారా తేటతెల్లమవుతోందని గంటా ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తిచేశామని గొప్పలు చెప్పిన జగన్‌, వాస్తవానికి 15 శాతం మాత్రమే అమలుచేశారని స్పష్టంచేశారు. ఎన్నికలను కురుక్షేత్ర సంగ్రామంతో పోల్చుతున్న జగన్‌రెడ్డి.. వైసీపీది పాండవ సైన్యమని చెప్పుకుంటున్నారని, అయితే ప్రజలు మాత్రం ఆ పార్టీని కౌరవ సైన్యంగా భావిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేసిన తల్లి, చెల్లి ఇప్పుడెందుకు వ్యతిరేకమయ్యారో జగన్‌ చెప్పగలరా? అని గంటా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని, ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ కచ్చితంగా గెలవగలిగే మూడు సీట్లు చెప్పండని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు.

Updated Date - Jan 29 , 2024 | 03:03 AM

Advertising
Advertising