ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సచివాలయ భవనాలు అంతేనా..?

ABN, Publish Date - Oct 27 , 2024 | 11:43 PM

గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పా టు చేసిన సచివాలయ, ఆర్బీకే భవనాలు నిధుల కొరత, అప్పటి ప్రభు త్వ నిర్వాకంతో అర్థాంతరంగా ఆగిపోయాయి.

పునాదులకే పరిమితమైన సచివాలయ భవన నిర్మాణం

పునాదులకే పరిమితమైన పలు సచివాలయాలు అరకొర పనులకు నోచుకోక అసంపూర్తిగా దర్శనమిస్తున్న ఆర్బీకే కేంద్రం

నిమ్మనపల్లె, అక్ట్టోబరు 27(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పా టు చేసిన సచివాలయ, ఆర్బీకే భవనాలు నిధుల కొరత, అప్పటి ప్రభు త్వ నిర్వాకంతో అర్థాంతరంగా ఆగిపోయాయి. కొన్ని చోట్ల పునాదులకే పరిమితం కాగా మరికొన్ని చోట్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసుకున్న అరకొర పనులు చేపట్టక అసంపూర్తిగా కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాం టి వాటిని పూర్తి చేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి నిధుల కొరత పెనుభారంగా మారింది. కాగా నిమ్మనపల్లె మండలంలో 12 సచివాలయాల మంజూరు చేసిన గత వైసీపీ ఒక్క సచివాలయం కూడా పూర్తి కాకపోగా వాటిలో కొన్ని నిర్మాణాలు పునాదుల వరకే పరి మితమయ్యాయి. 10పంచాయతీలకు గాను 12 సచివాలయాలు, ఆర్బీకే, హెల్త్‌వెల్ఫేర్‌ సెంటర్‌, పాల కేంద్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేసి నిర్మాణాలు చేపట్టాలని తలపెట్టిన ఒక్క భవన నిర్మాణం కూడా పూర్తి కాలేదు. సచివాలయ నిర్మాణానికి రూ.40లక్షలు, ఆర్బీకేకు రూ.21.50 లక్షలు, హెల్త్‌వెల్ఫేర్‌ సెంటర్‌కు రూ.18లక్షలు కేటాయించింది. దాదాపు ప్రతి సచివాలయ పరిధిలో 40శాతానికి పైగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా కొన్ని సచివాలయాలు అసంపూర్తిగా ఉండ గానే ప్రారంభించారు. మరి కొన్నిచోట్ల గోడలకు వరకు మరోచోట పునా దుకే పరితమయ్యాయి.

వైసీపీ నాయకులే కాంట్రాక్టర్‌గా మారి పనులు చేపట్టారు. కాగా మెటీరియల్‌ కాస్ట్‌ ఎక్కువగా వుండడంతో ప్రభుత్వం ఇచ్చే బిల్లులు సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు తెలిపారు. దీంతో గ్రామా లలో నిర్మించిన సచివాలయాలు అలంకారప్రాయంగా మిగిలిపోయి గుదిబండగా మారాయి. దీనిపై పీఆర్‌ డీఈ శివప్రసాద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా పనులు చేపట్టిన వరకు బిల్లులు మంజూరు అయ్యాయని చెప్పారు. అయితే కొండయ్యగారిపల్లెలో మాత్రమే పునాదు ల వరకు నిర్మాణాలు చేసినట్లు తెలిపారు.

Updated Date - Oct 27 , 2024 | 11:43 PM