లారీస్టాండ్‌లో అక్రమ వసూళ్లు
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:45 AM
భవానీపురం జాతీయ రహదారి పక్క నే విజయవాడ నగరపాలక సంస్థకు సు మారు నాలుగున్నర ఎకరాలకు పైగా ఖా ళీస్ధలం ఉంది.
భవానీపురం లారీస్టాండ్‌లో స్థానికంగా ఉంటున్న కొందరు లారీల పార్కింగ్ చేసినందుకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి నుంచి వీఎంసీలోని సంబంధిత అధికారులకు కూడా మామూళ్లు అందుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో వీఎంసీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు అక్రమ వసూళ్లకు పాల్పడిన వారే ప్రస్తుతం ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. లారీస్టాండ్ ప్రాంగణంలోని వ్యాపారులు కూడా కార్పొరేషన్‌కు అద్దెలు కట్టకుండా షాపులు వినియోగించుకుంటున్నారు.
- విద్యాధరపురం - ఆంధ్రజ్యోతి
భవానీపురం జాతీయ రహదారి పక్క నే విజయవాడ నగరపాలక సంస్థకు సు మారు నాలుగున్నర ఎకరాలకు పైగా ఖా ళీస్ధలం ఉంది. అందులో రెండు వాటర్ ట్యాంకులు నిర్మించారు. మిగిలిన స్ధలం లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను నిలిపేందుకు వినియోగించేవారు ఇబ్రహింపట్నం నుంచి వచ్చే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో లారీస్టాండ్‌ను సుమారు 15 ఏళ్ల క్రితం ఇబ్రహింపట్నం ట్రక్ టెర్మినల్‌కు తరలించారు. కొన్నేళ్లు వీఎంసీ ఆధ్వర్యంలో లారీస్టాండ్ నిర్వహించారు. అయితే ఇక్కడ లారీస్టాం డ్ ప్రాంగణంలోని వ్యాపారులు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు ప్రా రంభం కావటంతో లారీల రాకపోకల నిమిత్తం ఆ స్ధలంలో లారీల నిలుపుదల పూర్తిగా నిలిపేశారు. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక నేతలు ఈ లారీ స్టాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని భవానీపురం లారీ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో అనధికారిక కార్యాలయాన్ని ప్రారంభించారు. క అక్కడి నుంచి లారీలు నిలిపేందుకు ఒ క్కో లారీ వద్ద నుంచి అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంటే రోజుకు రూ.100, లేకుం టే రూ.200, భారీ వాహనాలకు రూ.300 అనధికారికంగా వసూలు చేస్తున్నారు. రో జూ సుమారు రూ.10వేలకు పైగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అద్దె చెల్లించని వ్యాపారులు
లారీ స్టాండ్ ప్రాంగణంలో సుమారు 35 షాపులు పైనే ఉన్నాయి. ఆయా షా పుల నిర్వాహకులందరూ వీఎంసీకి అద్దె చెల్లించకుండా అనధికారికంగా నిర్వహిస్తున్నారు. అటు అసోసియేషన్ నేతలు కూడా డబ్బులు కట్టకుండా కార్యాలయా న్ని వాడుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం లో కొనసాగించినట్లే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ వారి హవా కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో వీఎంసీ ఎస్టేట్ అధికారి అండదండలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అధికారికి అక్రమంగా వసూలు చేసిన డబ్బుల్లో సగం వాటా అందిస్తునట్టు తెలుస్తోంది. దీంతో ఆయన చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలు
రాత్రివేళలో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్, గంజాయిబ్యాచ్ సభ్యులకు, మందుబాబులకు ఈ స్టాండ్ కేంద్రంగా మారిందని స్ధానికులు వాపోతున్నారు. అంతేకాక కొంతమంది ఆటోడ్రైవర్లు రాత్రివేళలో ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వీఎంసీ కమిషనర్ స్పందించి లారీస్టాండ్‌లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Nov 20 , 2024 | 12:45 AM