ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తా

ABN, Publish Date - Oct 19 , 2024 | 03:46 AM

ఎన్నికల ముందు న్యాయవాదులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

బార్‌ అసోసియేషన్‌ సమావేశంలో మంత్రి లోకేశ్‌

విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు న్యాయవాదులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. జిల్లా కోర్టు నూతన భవన సముదాయంలో విశాఖ బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. విశాఖలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. న్యాయవాదులకు హెల్త్‌ కార్డుల జారీ గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంతో అనుసంధానం చేసి మెరుగైన స్కీమ్‌ తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. అనంతరం మంత్రి లోకేశ్‌ను బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.

Updated Date - Oct 19 , 2024 | 03:46 AM