వానొస్తే నరకమే..!
ABN, Publish Date - Oct 25 , 2024 | 11:03 PM
: ఓ చిన్నపాటి వాన వచ్చినా... స్థానిక గాంధీనగర్ అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు నిల్వ ఉంటోంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ధర్మవరం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఓ చిన్నపాటి వాన వచ్చినా... స్థానిక గాంధీనగర్ అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు నిల్వ ఉంటోంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట, రాంనగర్, బాలాజీనగర్, గుట్టకిందపల్లితో పాటు చిగిచెర్ల, బడన్నపల్లి, ఉప్పునేశనపల్లి, వసం తపురం గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జి కింది నుంచి వెళ్లాల్సిందే. అదే విధంగా రైల్వేస్టేషన నుంచి ప్రయాణీకులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ఇలా రావాల్సిందే. మంత్రి సత్యకుమార్ యాదవ్ రైల్వే అధికారులతో చర్చించి.. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Oct 25 , 2024 | 11:03 PM