జగన్‌కు ‘కాపు’ గుడ్‌బై!
ABN, Publish Date - Jan 06 , 2024 | 02:54 AM
వైసీపీలో మరో వికెట్ పడింది. సీఎం జగన్‌కి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు.
మరికొందరికి టికెట్ల నిరాకరణ
వైసీపీలో పెరిగిన రచ్చ
నమ్మించి గొంతు కోశారు
దరిద్రపు సర్వేల పేరుతో నో అంటారా?
స్వతంత్రంగా బరిలోకి దిగుతా
రాయదుర్గం ఎమ్మెల్యే ప్రకటన
మంత్రి జయరాంకూ జగన్ ఝలక్
ఎంపీగా పోటీ చేయాలని సూచన
గుంటూరుకు మారాలని ‘లావు’కూ..
పేట నుంచైతేనే పోటీ చేస్తానన్న ఎంపీ
వైసీపీలో టికెట్ల రచ్చ మరింత పెరిగింది. సీట్లపై తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న ఆదేశాలతో అసంతృప్తులు రగులు తున్నారు. శుక్రవారం మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్‌బై చెప్పారు.
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీలో మరో వికెట్ పడింది. సీఎం జగన్‌కి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. సర్వేల పేరు చెప్పి రాయదుర్గం టికెట్ నిరాకరించి.. తన గొంతు కోశారని వాపోయారు. వారం రోజులుగా ఆయన సీఎం అపాయింట్‌మెంట్ కోసం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లోపలకు పిలిచారు. ‘సర్వేలు నీకు అనుకూలంగా లేవు.. టికెట్ ఇవ్వలేనని సీఎం చెప్పమన్నారు’ అని అనడంతో తీవ్ర మనస్తాపం చెందారు. ‘మీరు చెప్పినవన్నీ చేశా.. రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడ్డా.. గడప గడపకు తిరిగా.. ఆ దరిద్ర పు సర్వేల పేరుతో గొంతు కోస్తారా.. నమ్మినందుకు తగిన శాస్తి చేశారు..’ అని సజ్జలతో అని ఆవేదనతో బయటకు వచ్చారు. అక్కడున్న మీడియా ప్రతినిధులు పలకరించగా.. ‘ఇంత అవమానం నా జీవితంలో ఎన్నడూ జరగలేదు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు ఇంతగా వంచిస్తాడని అనుకోలేదు’ అన్నారు. జగన్ కోసం కాంగ్రె్‌సను, ఐదేళ్ల పదవిని వదిలేసి వైసీపీలోకి వచ్చానన్నారు. ‘మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చాడు.. గడప గడపకు తిరగమన్నాడు.. చెప్పి న ప్రతిదీ చేశా.. చివరికి సర్వే ల పేరుతో సీటు లేదని సజ్జల తో చెప్పించాడు.. జగన్‌కు గుడ్ బై’ అని అన్నారు. ఏ పార్టీ టికె ట్ ఇచ్చినా రాయదుర్గంలో పో టీచేస్తానని.. ఒకవేళ ఇవ్వకుం టే తన భార్య లేదా కుమారు డు రాయదుర్గంలో, తాను కల్యాణదుర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని చెప్పారు. ‘జగనే మాకు సర్వస్వమని నమ్మాం. దేవుడితో సమానంగా భావించాం. మా ఇంట్లో లైట్లు వేస్తే కనిపించే ఫొటోలన్నీ జగన్‌వే. నమ్మించి గొంతు కోస్తాడని ఊహించలే దు. మా జీవితాలు సర్వనాశనమయ్యాయి. 2014, 2019లో పోటీ చేయనని చెప్పా. కానీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా నెరవేర్చలేదు. రాయదుర్గంలో రామచంద్రారెడ్డి అంటే వైఎస్, జగన్‌కు వీరాభిమాని అంటారు. అలాంటి మమ్మల్నే కలిసేందుకు ఆయన ఇష్టపడ డం లేదు. జగన్ నమ్మించి గొంతు కోసే రకం. వైసీపీ నుంచి మేం వెళ్లిపోతున్నాం. గుడ్ బై చెబుతున్నా. ఆయనకో దండం’ అన్నారు.
తిరుగుబాట్లు
సీఎం జగన్‌పై తిరుగుబాట్లు పెరుగుతున్నాయి. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరి షర్మిల వెంట నడిచేందుకు వెళ్లిపోయారు. ఇప్పుడు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా వెళ్లిపోయారు. జగ్గంపేట ఎమ్మె ల్యే జ్యోతుల చంటిబాబు కూడా ప్ర త్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. విశాఖ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరిపోయారు. హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్ రగిలిపోతున్నారు. ఎందుకు టికెట్ ఇవ్వరని సలహాదారు సజ్జలపైనే కేకలు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శించాలనిజగన్ షరతులు పెడుతున్నారు. ఇవి నచ్చని కందుకూరు ఎమ్మెల్యే ఎం. మహీధర్‌రెడ్డిలాంటి వాళ్లు టికెట్ ఇస్తే ఇచ్చారు.. లేదంటే లేదని.. ఎవరినీ తిట్టబోమని తేల్చిచెప్పారు.
Updated Date - Jan 06 , 2024 | 02:54 AM