ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

ABN, Publish Date - Jan 29 , 2024 | 11:40 PM

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూఅక్రమాలపై సమగ్ర విచారణ చేయించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ.. జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబుకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల.. కలెక్టర్‌ అరుణ్‌బాబుకు వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల ఫిర్యాదు

పుట్టపర్తి, జనవరి 29: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూఅక్రమాలపై సమగ్ర విచారణ చేయించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ.. జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబుకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల.. కలెక్టర్‌ అరుణ్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రోద్బలంతోనే తహసీల్దార్‌ యుగేశ్వరీదేవి పెద్దఎత్తున భూఅక్రమాలకు పాల్పడ్డారంటూ ఆమెను సస్పెండ్‌ చేశారని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ భూఅక్రమాలపై సమగ్ర విచారణ చేయించాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం గోనుగుంట్ల మీడియాతో మాట్లాడుతూ.. ధర్మవరంలో పాలేగాళ్ల రాజ్యం నడుస్తోందన్నారు. అఽధికారాన్ని అడ్డుపెట్టుకుని కేతిరెడ్డి వేలకోట్ల రూపాయలు గడించారన్నారు. నిరుపేదలు, అమాయకులను టార్గెట్‌ చేసుకుని, రూ.కోటి విలువచేసే భూమిని కేవలం లక్ష, రెండు లక్షలకు కొనుగోలు చేసి, కోట్లు గడించాడన్నారు. 4వేలకోట్ల రూపాయలు కేతిరెడ్డి అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు. రౌడీలు, గుండాలను పెంచిపోషిస్తున్నారని మండిపడ్డారు. చేనేత వర్గాలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఏకంగా ఇంట్లోనే రిజిసా్ట్రర్‌ ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారన్నారు. డిజిటల్‌ కీ ఇంట్లో పెట్టుకుని, ఒక్కో రిజిస్ట్రేషనపై రూ.10లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమాలపై ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్ర విచారణ చేయిస్తామని ఆయన ఉద్ఘాటించారు.

Updated Date - Jan 29 , 2024 | 11:40 PM

Advertising
Advertising