ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాల ఎగ్గొట్టి.. కిడ్నాప్‌ కథ..!

ABN, Publish Date - Dec 06 , 2024 | 06:01 AM

ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పాఠశాల ఎగ్గొట్టింది. తండ్రి ప్రశ్నించడంతో... తాను కిడ్నా్‌పకు గురైనట్టు సినిమా స్టోరీ వినిపించింది. కూతురు చెప్పింది నిజమేనని నమ్మిన ఆ తండ్రి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల్లో

కారులో ఎత్తుకెళ్లారని చెప్పిన బాలిక

భయంతో పోలీసులకు తండ్రి ఫిర్యాదు

అసలు కథ చూపించిన సీసీ పుటేజీ

సీతానగరం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పాఠశాల ఎగ్గొట్టింది. తండ్రి ప్రశ్నించడంతో... తాను కిడ్నా్‌పకు గురైనట్టు సినిమా స్టోరీ వినిపించింది. కూతురు చెప్పింది నిజమేనని నమ్మిన ఆ తండ్రి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల్లో అసలు కథ బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామానికి చెందిన బాలిక (13) ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం స్కూలుకు బయల్దేరిన బాలిక అదే దారిలో ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుని అక్కడ కూర్చుంది. మధ్యాహ్నం సమయానికే ఇంటికి చేరుకోవడంతో తండ్రి ఎందుకు వచ్చేశావని ప్రశ్నించాడు. దీంతో బాలిక కిడ్నాప్‌ స్టోరీ అల్లింది. ఐదుగురు వ్యక్తులు ఎర్టిగా బ్లాక్‌ కార్‌లో మసుగులు వేసుకుని శివాలయం వద్ద ఉన్న తనను కిడ్నాప్‌ చేశారని తండ్రికి చెప్పింది. అయితే సీతానగరం గ్రామంలోని నాలుగు బొమ్మల సెంటర్‌లో ఆర్‌కే రెస్టారెంట్‌ వద్ద కారు ఆపి కిడ్నాపర్లు ఫోన్‌లలో మాట్లాడుతుండగా డోరు తీసుకుని పారిపోయి వచ్చానని తెలిపింది. దీంతో భయాందోళనకు గురైన తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీతానగరం ఎస్‌ఐ రామ్‌కుమార్‌ సిబ్బంది పరుగులు తీశారు. సీతానగరంలో ఉన్న అన్ని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. శివాలయం వద్ద ఉన్న సీసీ పుటేజీని పరిశీలించగా బాలిక శివాలయంలో కొంతసేపు కూర్చుని తర్వాత ఇంటికి వెళ్లినట్టు గుర్తించారు. బాలిక చెప్పిన కథకి, సీసీ కెమెరాల్లోని పుటేజీకీ ఏ మాత్రం సంబంధం లేకపోవడంతో కిడ్నాప్‌ ప్రయత్నాలేమీ జరగలేదని పోలీసులు తేల్చేశారు. కేవలం స్కూల్‌ మానేయడానికే బాలిక ఈ కఽథ అల్లిందని.. ఐదుగురు కిడ్నాపర్లు ఉంటే తప్పించుకోవడం అంత తేలిక కాదని పేర్కొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 06:01 AM