ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సరదాగా సంబరాలు.. సీరియస్‌గా అక్రమాలు

ABN, Publish Date - Jan 22 , 2024 | 03:43 AM

పల్నాడు జిల్లాలో ఓ ఎమ్మెల్యే రోజువారీ డబ్బు సంపాదన లక్ష్యం నిర్దేశించుకొని చెలరేగి పోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా దందాలతో పేట్రేగిపోతున్నారు.

పల్నాడు జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యేకి తెలిసింది రెండే రెండు పనులు. ఒకటి అడ్డదిడ్డంగా సంపాదించడం.. రెండోది కుదిరినకాడికి పాపపు పనులు చేయడం. ఈ రెండు పనుల్లో ఆ ఎమ్మెల్యే పీహెచ్‌డీ చేశాడని సొంత పార్టీ నేతలే చెబుతారు. ‘తివిరి ఇసుమున తైలంబు తీయ’గల ఈ ఎమ్మెల్యేకి అధికారం చేతిలోకి రావడం మరిన్ని పాపపు పనులకు పురిగొల్పింది.

ఏదైనా కార్యక్రమాలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పిలిేస్త ‘తలకాయ మాంసం ఉందా’ అని అడగటం ఈ ఎమ్మెల్యే ప్రత్యేకత. వయసు మీద పడినా ఎందులోనూ యావ చావ లేదని సొంత పార్టీ నేతలే అంటుంటారు. ఇక, వచ్చే ఎన్నికల్లో టికెట్‌ సెగ మామూలుగా లేదు. సొంత నేతలే ఓడిస్తామని చెప్పేస్తున్నారు.

ఆ ఎమ్మెల్యే తీరే వేరు

జగనన్న కాలనీల్లో భారీ అవినీతి

పరిహారం సొమ్మునూ వదలని వైనం

ప్రతి పనికీ రేటు.. కట్టకపోతే వేటు

‘రియల్‌’ వ్యాపారంలో భారీగా భోజ్యం

మైనింగ్‌ దోపిడీలోనూ భాగస్వామ్యం

మద్యం నుంచి మట్టి వరకు హాంఫట్‌

అరగంట ఎమ్మెల్యే అవినీతి పురాణం

ఆయన మేతపై సొంత నేతల నుంచే సెగ

టికెట్‌ ఇస్తే ఓడిస్తామని బహిరంగ సవాళ్లు

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

పల్నాడు జిల్లాలో ఓ ఎమ్మెల్యే రోజువారీ డబ్బు సంపాదన లక్ష్యం నిర్దేశించుకొని చెలరేగి పోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా దందాలతో పేట్రేగిపోతున్నారు. అధికారమే అండగా ఇక అవకాశం రాదేమోనన్నట్లుగా లక్ష్యాలు నిర్దేశించి మరీ దోచుకుంటున్నారు. మట్టిని సైతం వదలకుండా కొల్లగొడుతున్నారు. అభివృద్థి పనులకు రేటు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. రియల్‌ వ్యాపారం చేయాలన్నా కప్పం కట్టాల్సిందే. ప్రభుత్వ పథకాలనూ వదలకుండా దందా చేస్తున్నారు. ఆ నేతను ముద్దుగా సంబరాల బాబు.. కాం బాబు.. శ్యాంబాబు అని ప్రతిపక్ష నేతలే కాదు.. ఆయనంటే గిట్టని సొంత పార్టీ నేతలూ పిలుస్తుంటారు. ఆ నియోజకవర్గంలో ఈయన అవినీతి, అక్రమాలను సొంత పార్టీ మనుషులే నిలదీస్తున్నారంటే ఏ మేరకు అక్రమాలకు పాల్పడుతున్నారో అర్ధమవుతుంది. ఆయనకు ఎదురు తిరిగిన సొంత పార్టీ వ్యక్తులపైనే కేసులు పెట్టించారు. ఎమ్మెల్యే అక్రమ క్వారీయింగ్‌ విషయంలో సొంత వారే హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. అడిగినంత ఇవ్వలేదని పరిశ్రమలపై ఉక్కుపాదం మోపారు. 23 సున్నం మిల్లులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయించడంతో మిల్లులు మూత పడి కార్మికుల ఉపాధికి గండిపడింది. రియల్‌ వెంచర్ల వ్యాపారుల వద్ద డబ్బు దండుకుంటున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. స్థిరాస్తి వ్యాపారానికి అనుమతులు రావాలంటే ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించాల్సిందేనని స్థానికంగా ప్రచారంలో ఉంది. ఇక, ఈ ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలనూ వదలలేదు. జగనన్న కాలనీల మాటున పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. భూమిని తన అనుచరుల ద్వారా తక్కువ రేటుకు కోనుగోలు చేయించి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించినట్టు వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఇలా ఎకరాకు రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు అక్రమంగా ఆర్జించినట్టు సమాచారం. చివరకు పార్టీ పదవులను కూడా వదల్లేదు.

మండలానికో అనుచరుడు!

మండలానికి ఒక అనుచరుడిని నియమించుకొని వారి ద్వారా ఎమ్మెల్యే వసూళ్ల పర్వం సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా ఎదుట పలుమార్లు ఆ నేత అక్రమార్జనను కొందరు సొంత పార్టీ నేతలే వెల్లడించడం గమనార్హం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద డబ్బు దండుకుంటున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. అయన అక్రమార్జనపై పార్టీలోని వ్యక్తులు కఽథలు కఽథలుగా చెబుతుంటారు. ఇలా అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్ముతో ఒక మండలంలో సదరు ఎమ్మెల్యే 20 ఎకరాలు కొనుగోలు చేసి గెస్ట్‌ హౌస్‌ నిర్మించుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేత ఓ మహిళతో సాగించిన కామ సంభాషణ ఆడియో వైరల్‌ అయ్యింది. ఎమ్మెల్యే కాకముందు కూడా హైదరాబాద్‌లో ఒక మహిళతో ఇలాం టి సంభాషణే జరిపి అడ్డంగా బుక్‌ అయ్యారు.

బార్‌ల నుంచి భారీగా

తాను ప్రాతినిఽథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్లను సిండికేట్‌గా ఏర్పాటు చేసి నెల వారిగా ఈ ఎమ్మెల్యే వాటాలు దోచేస్తున్నారు. నాలుగు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కూడా ఈయన ఆధ్వర్యంలోనే నడుస్తుండడం గమనార్హం. మద్యం షాపులను సిండికేట్‌గా ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టారు. పట్టణంలో 40 సెంట్లు దాకా స్థిరాస్తిని రియల్‌ ఎేస్టట్‌ వ్యాపారుల ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. ఒక స్పిన్నింగ్‌ మిల్లును మూయించేసి వందలాది మంది కార్మికులను రోడ్డున పడేసిన వ్యక్తి వద్ద రూ.1.50 కోట్లు తీసుకొని ఆయన భార్యకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. పురపాలక సంఘంలో చైర్‌పర్సన్‌ రాటిఫికేషన్‌ పేరిట నామమాత్రంగా పనులు చేస్తూ రెండేళ్ల కాలంలో చైర్‌పర్సన్‌ భర్త నుంచి సదరు ఎమ్మెల్యే రూ.2 కోట్లకు పైగా దోచుకున్నారు. పురపాలక సంఘంలో సాంబశివ మహత్యం చూపిస్తూ దోపిడీకి తెరదీశారు. సున్నపురాయి వ్యాపారుల నుంచి ప్రతి నెలా రూ.కోటి మామూళ్లు మామూలుగా మారాయి.

టికెట్‌ సెగ

సంబరాల ఎమ్మెల్యే బాబు.. స్థానికేతరుడు కావడం తో వచ్చే ఎన్నికల్లో స్థానికులకే పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలన్న నినాదాన్ని సీనియర్లు తెరపైకి తెచ్చారు. తమ మా టను కాదని ఆ నేతకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇేస్త ఓడిస్తామని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఆయన కు వ్యతిరేకంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనను నిర్వహించారు.

కరిగిన కొండలు!

ఎమ్మెల్యే సాగిస్తున్న అవినీతి, అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందనే వాదన ఉంది. ఎమ్మెల్యే కనుసన్నల్లో సాగుతున్న అక్రమ మైనింగ్‌తో కొండలు, గుట్టలు కరిగిపోయాయి. రెండు మండలాల్లో ఆ నేత కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది. పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన నేతలను దూరంగా పెట్టారన్న విమర్శలు సొంత మనుషుల నుంచే వ్యక్తమవుతున్నాయి. అక్రమ మైనింగ్‌కు అడ్డు వస్తున్నారని సొంత పార్టీలోని నేతల పైనే నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయించారు. ఏకంగా ఆ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసే పరిస్థితి వచ్చిందంటే అక్కడ నెలకొన్న పరిస్థితి తీవ్రత తెలుస్తుంది.

సంబరాల బాబు

ఏటా సంక్రాంతి వస్తోందంటే ఈ ఎమ్మెల్యేకు సంబరాలే. ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీల పేరుతో లక్కీడిప్‌ నిర్వహిస్తారు. వేలాది కూపన్లు అమ్మిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ విషయంపై కోర్టులో ప్రైవేటు కేసు కూడా నమోదైంది. ఇక, నోటి దూలకు ఈయన పెట్టింది పేరు. రూ.2 కోట్లు తీసుకుని నియోజకవర్గంలో జిల్లా పరిషత్‌ స్థలం వేరొకరికి కట్టబెట్టెందుకు రంగం సిద్థం చేశారు. దీనిపై జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌కు, ఆయనకు వివాదం నడుస్తోంది.

Updated Date - Jan 22 , 2024 | 06:35 AM

Advertising
Advertising