పేదవాడి కోసమే...
ABN, Publish Date - Sep 21 , 2024 | 11:31 PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డాడని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు.
అన్న క్యాంటీన్లను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత
కల్లూరు, సెప్టెంబరు 21: ఐదేళ్ల వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డాడని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెడితే ఎంతో మానసిక ఆనందం కలుగుతుందన్నారు. కల్లూరు అర్బన పరిధిలోని పరిమళనగర్, కల్లూరు ఎస్టేట్‌లో రెండు అన్న క్యాంటీన్లను శనివారం ఎమ్మెల్యే పునఃప్రారంభించారు. ఎమ్మెల్యే గౌరుచరిత పేదలకు అన్నం వడ్డించి, వారితో కలిసి అన్న క్యాంటీనలో భోజనం చేశారు. ఈ సందర్బంగా గౌరుచరిత మాట్లాడుతూ ఐదు రూపాయలకే పేదల కడుపునింపే బృహత్తర కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించడం జరగుతుందన్నారు. గత వైసీపీ పాలనలో నిర్ధాక్షిణ్యంగా క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు మార్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు అన్నాక్యాంటీన్ల ప్రారంభానికి సంతకం చేశారన్నారు. కల్లూరు పరిధిలోని నంద్యాల చెక్‌పోస్ట్ సమీపంలో మరో క్యాంటీన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని గౌరుచరిత హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, ఆరోగ్యాధికారి విశ్వేశ్వరరెడ్డి, ఎస్‌ఈ వేణుగోపాల్, ఎంఈ శేషసాయి, డీఈ రాజశేఖర్, నాయకులు ఎనవీ రామకృష్ణ, టైలర్ నాగరాజు, రవి ప్రకాష్‌రెడ్డి, మాదన్న, ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 11:31 PM