ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కవిత్వమై..పుట్టింది!

ABN, Publish Date - Oct 27 , 2024 | 01:45 AM

పత్రిక నిర్వహణ కష్టమైన పని. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అందు లోనూ కేవలం కవిత్వం మీదనే ఒక పత్రిక నడపడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు..

‘కవిసంధ్య’ 50 సంచికల విజయయాత్ర

నేడు యానాంలో స్వర్ణోత్సవ సభ

13 మందికి ప్రతిభా పురస్కారాలు

- ఆంధ్రజ్యోతి/యానాం

పత్రిక నిర్వహణ కష్టమైన పని. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అందు లోనూ కేవలం కవిత్వం మీదనే ఒక పత్రిక నడపడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. ఈ బాధ్యతను ప్రముఖకవి శిఖామణి ఎప్పుడో భుజానకెత్తుకున్నారు. యానాం కేంద్రంగా కవిత్వమే ప్రధానంగా ‘కవిసంధ్య’ ఆరంభమైంది. ఎనిమిదేళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం తాజాగా స్వర్ణోత్సవ సంచికను తీసుకువచ్చింది. ఈ సందర్భంతోపాటు ఏటా కవిసంధ్య పేరిట జరిగే పురస్కారాల వేడుకను కూడా ఈనెల 27 ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు యానాంలోని గీతాభవన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో స్వర్ణోత్సవ సంచిక ఆవిష్కరణ, అనంతరం వాడ్రేవు చినవీరభద్రుడు, పాయల మురళీకృష్ణలకు కవితా పురస్కారాలను ప్రదానం చేస్తారు. అలాగే శిఖామణి మలయాళ కవిత్వ గ్రంథావిష్కరణ, కవిసమ్మేళన కార్యక్రమాలు జరగున్నాయి. అదేవిధంగా కవిసంధ్య ప్రతిభా పురస్కారాలను మరో 13 మందికి అందజేయ నున్నారు. కవిసంధ్య సంపాదకుడు, కళారత్న శిఖామణి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమా లకు ముఖ్యఅతిథిగా పుదుచ్ఛేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, అతిథులుగా సాహితీవేత్తలు డాక్టర్‌ దీర్ఘాశి విజయ్‌భాస్కర్‌, డా.సి.మృణాళిని, డా.వీరలక్ష్మీదేవి, డా.ఆర్‌.సీతారాం, డా.వరుగు భాస్కర్‌రెడ్డి, దాట్ల దేవదానంరాజు హాజరవుతారు.

శిఖామణి ఏమంటున్నారంటే..

నాడు 16 పేజీలతో తొలి అడుగు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 2015లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ విరమణ పొందాను. అప్పటికే రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో కవిసంధ్య సాహిత్య కార్యక్రమాలను నిర్వహించింది. రాష్ట్ర విభజన తర్వాత కవిసంధ్య కార్యక్షేత్రాన్ని నా స్వగ్రా మం కేంద్రపాలిత ప్రాంతమైన యానాం మార్చాను. యానాంలో 2016 ఏప్రిల్‌ 8న ఉగాది వేడుకలకు కవిసంధ్య కవిత్వ పత్రి కగా వెలువడింది. ఏప్రిల్‌-మే ద్వైమాసిక సం చికగా యుగకర్త కందుకూరి వీరేశలింగం పంతులు ముఖచిత్రంలో 16 పేజీల సంచి కగా వెలువడింది. ఇప్పుడు స్వర్ణోత్సవ సం చిక 136 పేజీలతో వెలువడుతోంది.

కవిత్వానికి పత్రిక కావాలి

ఒకప్పుడు తెలుగులో కఽథకు, నవలలకు ప్రత్యేక పత్రికలుండేవి. ఆంధ్రజ్యోతి వీక్లీలో ఈవారం కవిత పేరుతో ఒక పేజీ కేటాయించేవారు. సండే మ్యాగజైన్లో కూడా కవిత్వానికి ఒక పేజీ ఉండేది. ప్రస్తుతం నేను ప్రముఖ కవులు, రచయితల సంతకాలు సేకరించి కవిత్వ పేజీ అవసరాన్ని గుర్తుచేస్తున్నాను. కవిత్వానికి స్థల నిర్దేశం చేయడం పోలీసింగ్‌లాంటిది. కవిత్వానికి పోలీసింగ్‌ మంచిదికాదు. గతంలో కంజిర, సంతకాలు, జముకు, చైతన్య కవిత వంటి పత్రికలు వచ్చి ఆగిపోయాయి. కవిత్వానికి ఒక పత్రిక అవసరం.

ప్రయత్నం... ప్రయాస కాదు..

కవిసంధ్య సన్నాహక సభలో మిత్రులు అన్నట్టు రచనలు వచ్చినంతగా చందాలు రావన్నది అనుభవం మీద తెలిసింది. తొలి సంవత్సరంలో సాహితీ మిత్రులు ఇచ్చిన ప్రో త్సాహం మరువలేనిది. తర్వాత రచనలు అడిగినంత చనువుగా చందాలు, రెన్యూవల్స్‌ అడగలేకపోయాం. కవిసంధ్య తయారీ హైదరాబాద్‌లో.. ప్రింటింగ్‌ విజయవాడలో.. పోస్టింగ్‌ యానాంలో.. ఒక అరడజను మిత్రు లతో కలిసి యానాం కవిసంధ్య ఆఫీసులో కూర్చుని పత్రికలకు పోస్టింగ్‌కు సిద్ధం చేసేవాళ్లం. ఇప్పటికీ ఇదే కార్యక్రమం. అయినప్ప టికీ ఇది ఆనందమేకానీ ప్రయాసకాదు.

జ్ఞాపకాలు, సన్నివేశాలు...

పత్రిక ప్రారంభించాక కొత్తలో ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి పది వేల చెక్కును పంపించారు. అది కవిసంధ్య పేరుమీద ఉంది. అప్పటికి కవిసంధ్యకు ఇంకా బ్యాంకు అకౌంట్‌ తెరవలేదు. అదే విషయం ఆమెకు చెబితే నా పేరున మరో చెక్కు పంపారు. కవిసంధ్య పేరున ఉన్న చెక్కును తిరిగి పంపుతుంటే వద్దు అకౌంట్‌ తెరిచాక అది కూడా బ్యాంకులో వేసుకోండి అన్నా రామె. పేరు చెప్పడానికి ఇష్టపడని అజ్ఞాత సౌజన్యమూర్తులూ కొందరు కవిసంధ్యకు అండగా ఉన్నారు. నాకు కవిగా పదుల సం ఖ్యలో చిన్నా పెద్దా పురస్కారాలు వచ్చాయి. అయితే ప్రముఖ పద్యకవి అనుమాండ్ల భూ మయ్య ఇటీవల పద్యకవి సత్కార సభలో కవిసంధ్య పత్రిక సంపాదకుడిగా నన్ను పిలిచి సత్కరించడం కవిసంధ్యకు, సంపాదకుడిగా నాకు దక్కిన తొలి సత్కారం ఇది.

ఇక భవిష్యత్తు ఆలోచన...

కవిసంధ్య 50 సంచికలను మనసు ఫౌం డేషన్‌ రాయుడు సౌజన్యంతో డిజిటలైజేషన్‌ చేసి భవిష్యత్తరాలకోసం భద్రపరచాలనే ఆలోచనగా ఉంది. వచన కవిత్వం వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో వందేళ్ల వచన కవిత పేరుతో ఒక సంకలనం తెచ్చే యోచన ఉంది. - ఆంధ్రజ్యోతి/యానాం

Updated Date - Oct 27 , 2024 | 01:45 AM