తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయాలి
ABN, Publish Date - Dec 01 , 2024 | 01:28 AM
ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అమలాపురం ఆర్డీవో కె.మాధవి అన్నారు.
అంతర్వేది, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అమలాపురం ఆర్డీవో కె.మాధవి అన్నారు. సఖినేటిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మండల అధికారులతో తుఫాన్ ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, వెటర్నరీ, వైద్య, విద్య అధికారులతో మాట్లాడారు. అంతర్వేదిపల్లిపాలెం, దేవస్థానం, అంతర్వేది, కేశవదాసుపాలెం, గొంది గ్రామాల్లో ఉన్న తుఫాను షెల్టర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్నారు. తుఫాన్ అనంతరం ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, మత్స్యకార గ్రామాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలన్నారు.తహశీల్దార్ (ఎఫ్‌ఏసీ) సీహెచ్ భాస్కర్, ఎంపీడీవో (ఎఫ్‌ఏసీ) కె.సూర్యనారాయణ, ఆర్‌ఐ రామరాజు, ఎస్‌ఐ కె.దుర్గాశ్రీనివాస్, ఏవో పీవీ నరసింహారావు, వైద్యాధికారి డాక్టర్ యూనస్, ఎంఈవో డి.కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 01:28 AM