ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అటు జోరు.. ఇటు బేజారు

ABN, Publish Date - Mar 26 , 2024 | 12:52 AM

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎట్టకేలకు అభ్యర్థుల ఎంపిక పూర్తవడంతో టీడీపీ కూటమి, అధికార వైసీపీ అభ్యర్థులు ఎన్నికల రణక్షేత్రంలో ప్రచారహోరు పెంచారు. రోజూ ఉదయం, రాత్రి ఇంటింటా ప్రచారం స్పీడు పెంచారు.

  • జిల్లాలో ఊపందుకున్న అసెంబ్లీ ఎన్నికల వేడి

  • ఎట్టకేలకు టీడీపీ కూటమి, వైసీపీ అభ్యర్థుల ఎంపిక ప్రహసనం పూర్తి

  • రకరకాల సర్వేలు, వడపోతలు, బేరీజుల తర్వాత నేతల పేర్లు వెల్లడి

  • ఎన్నికల బరిలో ప్రచారం ముమ్మరం చేసిన ఇరు పార్టీల అభ్యర్థులు

  • సూపర్‌సిక్స్‌ పథకాలు, అధికారపార్టీ అరాచకాలపై టీడీపీ, జనసేన ప్రచారం

  • కేవలం ప్రలోభాలు, విందులు, వినోదాలతో వైసీపీ అభ్యర్థుల అడ్డదార్లు

  • ఒకపక్క వలంటీర్లు, మరోపక్క కీలక కార్యకర్తలకు డబ్బులు, గిఫ్ట్‌ల పంపకాలు

  • గడపగడపకు ప్రచారంలో జనం తిరగబడుతుండడంతో ఓటమి గుబులు

  • ఇప్పటికే సమస్యలపై ప్రత్తిపాడు, కాకినాడ సిటీ వైసీపీ అభ్యర్థులకు చుక్కెదురు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎట్టకేలకు అభ్యర్థుల ఎంపిక పూర్తవడంతో టీడీపీ కూటమి, అధికార వైసీపీ అభ్యర్థులు ఎన్నికల రణక్షేత్రంలో ప్రచారహోరు పెంచారు. రోజూ ఉదయం, రాత్రి ఇంటింటా ప్రచారం స్పీడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జిల్లాలో దాదాపు నాలుగునెలలపాటు సాగింది. అభ్యర్థుల సామర్థ్యాలు, గెలుపోటముల లెక్కలు, సామాజిక సమతూకాల కసరత్తుతో కొన్నినెలలపాటు టీడీపీ, జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల ఎంపిక సుదీర్ఘంగా సాగింది. ఎట్టకేలకు జిల్లాలో ఏడు స్థానాలపై ఇరుపార్టీలు తమ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేశాయి. ఏ నియోజకవర్గంనుంచి ఎవరు బరిలో ఉంటాయో ప్రకటించేశాయి. ఎన్నికల షెడ్యూల్‌ కూడా రావడంతో ఇప్పుడు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, వైసీపీ అభ్యర్థులు ముమ్మర ప్రచారం మొదలుపెట్టారు. పార్టీ ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలు, మరోపక్క అధికార వైసీపీ అక్రమా లు, అరాచకాలు, ప్రజలను వేధింపులకు గురిచేసిన తీరును ఓటర్లకు టీడీపీ, జనసేన అభ్యర్థులు వివరిస్తూ ఇంటింటా తిరుగుతున్నారు. వైసీపీ అభ్యర్థులేమో ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిందేంటో చెప్ప లేక బిక్కుబిక్కుమంటూ గడపగడపకు వెళ్తున్నారు. ఎవరు ఏ సమస్య పై నిలదీస్తారో తెలియక ఉలిక్కిపడుతూనే ప్రచారం చేస్తున్నారు. దీం తో ప్రచారంకంటే ప్రలోభాలనేనమ్ముకుని అడ్డదారులు తొక్కుతున్నారు.

వైఫల్యాలను వివరిస్తూ.. చేయబోయేది చెబుతూ..

ఇంతకాలం ఎవరికి ఎక్కడ సీటు వస్తుందో.. తమ జాతకాలు ఏం టో తెలియక.. సీట్ల ఎంపికలో తమకు చోటుంటుందా.. లేదా.. అనే డైలమాతో టీడీపీ కూటమి, వైసీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఆశావహులు డైల మాలో కొట్టుమిట్టాడారు. ప్రధానంగా రాజకీయంగా కాకినాడ జిల్లా అన్ని పార్టీలకు అత్యంత కీలకం కావడంతో ఇతర జిల్లాలతో పోల్చితే ఇక్కడ టీడీపీ, జనసేన కూటమి, అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో చాలా జాప్యం జరిగింది. సగానికిపైగా సీట్లలో అభ్యర్థులను వెల్లడించ డానికి ఆయా పార్టీలు నానాపాట్లు పడ్డాయి. అభ్యర్థుల బలాబలాల బేరీజు దగ్గరనుంచి గెలిచే సామర్థ్యం ఉందా? లేదా? సామాజిక సమీక రణాల అంచనాలకు సరిపోతారా లేదా అనేదానిపై తీవ్ర కసరత్తు చేశాయి. ప్రధానంగా జనసేన పార్టీ కాకినాడ పార్లమెంట్‌ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ, కాకినాడ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. కానీ వీటిలో ఎవరు బరిలో నిలబడతారనేదానిపై చాలాకాలం స్పష్టత రాలే దు. సుదీర్ఘ సస్పెన్స్‌ తర్వాత జనసేన అధినేత పవన్‌ ఈ రెండు స్థానా ల గుట్టు విప్పారు. పిఠాపురంలో తాను, ఎంపీ స్థానంనుంచి టీ టైం అధినేత ఉదయ్‌ పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన స్థా నాలపై స్పష్టత వచ్చింది. ఆ తర్వాత కాకినాడ సిటీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిని ఢీకొట్టే నేతకోసం చాలా లెక్కలు వేసిన టీడీపీ సిటీ అభ్యర్థి ఎంపికను అదేపనిగా వాయిదా వేసింది. చివరకు అనేక లెక్కల తర్వాత తిరిగి ప్రస్తుత ఇన్‌ఛార్జి కొండబాబుకే సీటు ఖాయం చేసింది. అటు వైసీపీ సైతం ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట స్థానాలను మి నహా మిగిలిని సీట్లపై చాలాకాలం దోబూచులాడింది. జగ్గంపేట, పెద్దా పురం అభ్యర్థులు మారుతారని సంకేతాలు పంపింది. ఎట్టకేలకు ఎంపి క ప్రక్రియ పూర్తిచేసి అభ్యర్థులను ప్రకటించింది. దీంతో జిల్లాలో టీడీపీ కూటమి, వైసీపీ అభ్యర్థులు ఎవరనేదానిపై పూర్తిగా స్పష్టత వచ్చేసింది. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా టీడీపీ, జనసేన అభ్యర్థులు నియోజవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. పెద్దాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాజప్ప ఇంటింటా ప్రచారం స్పీడు పెంచారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలను కలుస్తూ టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలను వివరిస్తు న్నారు. జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం ఎన్నికల ప్రచార రథంపై ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. కాకి నాడ రూరల్‌నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీ, ప్రత్తిపాడునుం చి వరుపుల సత్యప్రభ, తునిలో యనమల దివ్య, కాకినాడ సిటీ నుంచి కొండబాబు ప్రచార హోరు పెంచారు. వీరంతా జనసేన, బీజేపీ నేత లు, క్యాడర్‌తో కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ టీడీపీ ప్రకటిం చిన సూపర్‌సిక్స్‌ పథకాలతో ప్రతిఒక్క కుటుంబం ఆర్థికంగా ఎంత లబ్ధి పొందబోతోందో ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో ఐదే ళ్ల వైసీపీ పాలన ప్రజలకు ఎంత నరకప్రాయంగా మారిందో వివరిస్తు న్నారు. పన్నుల వాత, ఛార్జీలమోత, సంక్షేమ పథకాల కోత.. ఇలా అనే క రకాల వైసీపీ అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలను వివరిస్తూ ప్ర చారం స్పీడు పెంచారు. ప్రజలనుంచి ఈసారి టీడీపీ కూటమికే తమ ఓటుఅంటూ మద్దతు లభిస్తుండడంతో టీడీపీ అభ్యర్థుల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది. మూడుపార్టీలనుంచి నేతలు, కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థితో ప్రచారం చేస్తుండడంతో ఎక్కడికక్కడ ప్రచారం హోరెత్తుతోం ది. కూటమి పేరు మార్మోగుతోంది. పిఠాపురంనుంచి జనసేన అభ్యర్థి పవన్‌ ఒకటి, రెండురోజుల్లో ప్రచారం ప్రారంభించనున్నారు. తద్వారా టీడీపీ కూటమికి ప్రజల్లో మరింత గ్రాఫ్‌ పెరగడం ఖాయమని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఏమీ చెప్పలేక.. బిక్కుబిక్కుగా..

అధికార వైసీపీ అభ్యర్థులు జిల్లాలో బిక్కుబిక్కుమంటూ ప్రచారం మొదలుపె ట్టారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు జగన్‌ సర్కారు చేసిందే లేకపోవడంతో ఓటర్లకు ఏం చెప్పాలో కూడా ఆ పార్టీ అభ్యర్థులకు అర్థంకావడం లేదు. వాస్తవానికి జగన్‌ పా లనలో జిల్లాలో సంక్షేమ పథకాల్లో కోత ల తో లబ్ధిదారులను కుదించేయడంతో వారం తా ఆగ్రహంగా ఉన్నారు. అభివృద్ధి పిసరంతైనా లేకపోవడం, ఇంటి పన్ను, చెత్తపన్నుల పెంపు, విద్యుత్‌, బస్సు ఛార్జీల పెంపు, ఇళ్లస్థలాలు పూర్తిగా ఇవ్వలేకపోవడం, ఇచ్చిన చోట లేఅవుట్ల దారుణ దుస్థితి, ఇళ్లు కట్టుకున్న వారికి బిల్లులు అందకపోవడం ఇలా ఒకటేంటీ వైసీపీ ప్ర భుత్వ వైఫల్యాల జాబితా చాంతాడంత ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజ లు ఏదొక అంశంపై తమను నిలదీస్తుండడంతో వైసీపీ అభ్యర్థులు బెం బేలెత్తుతున్నారు. ఓటు వేయాలంటూ ఇంటింటికి వెళ్తుంటే ఎవరు ఎటువైపునుంచి వచ్చిన నిలదీసి పరువు తీసేస్తారేమోనని జంకుతు న్నారు. ఇటీవల కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఏటిమొగ నుంచి తొలిరోజు ప్రచారం ప్రారంభించగా, ఇన్నాళ్లకు తమ ప్రాంతం గుర్తొచ్చిందా.. అసలు మీ ప్రభుత్వం ఏంచేసింది.. చెత్తపన్నుతో వేధిస్తా రా.. అంటూ మహిళలు తిట్ల దండకం అందుకోవడంతో ద్వారంపూడి మొహం మాడిపోయింది. ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావును సైతం రహదారులు వేయడం చేతకాదు కానీ.. ఓటెందుకు అడుగుతా రు అంటూ జనం తిరగబడ్డారు. ఇలా అనేకచోట్ల నిరసనలు, నిలదీత లు ఎదురవుతుండడంతో వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో నానా తంటా లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనం నుంచి ఓట్లు ఎలాగూ పడవ నే భయంతో వైసీపీ అభ్యర్థులు భారీగా ప్రలోభాలను ఆశ్రయిస్తున్నా రు. నియోజకవర్గాల్లో వలంటీర్లతో రహస్య సమావేశాలు నిర్వహించి డబ్బులు, గిఫ్ట్‌లు ఇస్తూ తమ కోసం ప్రచారం చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. తాము ప్రజల్లోకి వెళ్తే తిరగబడుతున్నారని, అందుకే వలం టీర్లే తమను గెలిపించాలంటూ వారిని రహస్యంగా వాడుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజావ్యతిరేకతను తప్పించుకోవడంకోసం స్థానిక కీలక నా యకులు, గ్రామపెద్దలకు విందులు, వినోదాలు ఆఫర్‌ చేస్తూ వారిని మచ్చిక చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. టీడీపీ, జన సేన అభ్యర్థులు జరగబోయే మేలువివరిస్తూ ప్రచారం చేస్తుంటే వైసీపీ అభ్యర్థులు ప్రజా వ్యతిరేకత భయంతో అడ్డదార్లలో పయనిస్తున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:52 AM

Advertising
Advertising