ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాపిరాజుకు టీడీపీలో ప్రాధాన్యమివ్వాలి

ABN, Publish Date - Jan 12 , 2024 | 11:19 PM

విద్యార్థి దశ నుంచి ముళ్ళపూడి బాపిరాజు టీడీపీకి అనేక సేవలు చేశారని, జడ్పీ చైర్మన్‌గా పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి, ఉత్తమ జిల్లా పరిషత్‌గా జాతీయ అవార్డు పొందారని, ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించాలని పలువురు పార్టీ నాయకులు కోరారు.

మంగళగిరిలో పోగ్రామ్‌ కమిటీ కార్యదర్శి స్వాతిని కలిసిన నాయకులు

నల్లజర్ల, జనవరి 12: విద్యార్థి దశ నుంచి ముళ్ళపూడి బాపిరాజు టీడీపీకి అనేక సేవలు చేశారని, జడ్పీ చైర్మన్‌గా పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి, ఉత్తమ జిల్లా పరిషత్‌గా జాతీయ అవార్డు పొందారని, ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించాలని పలువురు పార్టీ నాయకులు కోరారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి కార్ల ర్యాలీతో పార్టీ అధినేత చంద్రబాబును కలవడానికి శుక్రవారం మంగళగిరి వెళ్లారు. చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో ప్రోగ్రామ్‌ కమిటీ కార్యదర్శి స్వాతికి చంద్రబాబుకు అందించాలని ఈ మేరకు రెండు వినతి పత్రాలు అందించారు. అలాగే గోపాలపురం టీడీపీ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు సీనియర్‌ కేడర్‌ను పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యే టికెట్‌ మద్దిపాటికి కాకుండా ఎవరికైనా ఇస్తేనే తామంతా కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు తాతిన సత్యనారాయణ, రావూరి వెంకటరమణ, అల్లాడ రాజారావు, వల్లూరి సత్తిపండు, గుదే సుబ్బారావు, ఏలేటీ సత్యనారాయణ, వేణు, గుదే శ్రీను, కోఠారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:19 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising