ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ రద్దు చేసిన సర్క్యులర్‌ను పునరుద్ధరించాలి

ABN, Publish Date - Sep 20 , 2024 | 12:44 AM

ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన 1/2019 సర్క్యులర్‌ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ సర్క్యులర్‌ను మళ్లీ పునరుద్దరించాలని ఏపీపీటీడీ ఎంప్లాయిస్‌ యూని యన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు కోరారు.

రామచంద్రపురం(ద్రాక్షారామ), సెప్టెంబరు 19: ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన 1/2019 సర్క్యులర్‌ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ సర్క్యులర్‌ను మళ్లీ పునరుద్దరించాలని ఏపీపీటీడీ ఎంప్లాయిస్‌ యూని యన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు కోరారు. గురువారం రామచంద్రపురంలో చెలికాని రామారావు స్మారక మందిరంలో జరిగిన ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిపో కమిటీ సమావేశంంలో ఆయన మాట్లాడారు. 2022 నుంచి నిలిచిపోయిన నైట్‌హాల్టు అలవెన్సులు చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి పదోన్నతులు నిలిచిపోయాయని, ప్రభుత్వం వెంటనే పదోన్నతులకు అనుమతులు ఇవ్వాలన్నారు. విజయవాడ జోనల్‌ కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు ఇహెచ్‌ఎస్‌ ద్వారా వైద్య సేవలు అందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలుచేసిన రిఫరల్‌ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవ లు అందజేయాలని కోరారు. పలు యూనియన్లకు చెందిన 21మంది ఎంప్లాయిస్‌ యూనియన్‌లో చేరారు. కార్యక్రమంలో ఈయూ కోనసీమ జిల్లా అధ్యక్షుడు రావుల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి గిడ్ల చిరంజీవి, రీజనల్‌ బాద్యులు పి.సత్తిబాబు, సిసియస్‌ డెలిగేట్‌ టి.గన్నియ్య, డిపో అధ్యక్షుడు డి.ఎం.రావు,కార్యదర్శి లక్ష్మీనారాయణ, జాయింటు సెక్రటరీ డీఎస్‌ఆర్‌ కృష్ణ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 12:44 AM