ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రూ.25 కోట్లు గుటుక్కు

ABN, Publish Date - Jan 18 , 2024 | 01:18 AM

పండుగ నాలుగు రోజులూ కిక్‌ గట్టిగానే ఎక్కింది. కోడి పందెం బరులు పెద్ద సంఖ్యలో ఏర్పాటుచేయడం.. అక్కడ మందు ఏరులై పారడంతో మం దుబాబులు తెగ తాగేశారు.

4 రోజుల్లో.. ఇరగ తాగేశారు

పండక్కి పూటుగా మద్యం

25వేల కేసుల మందు.

1.20 లక్షల బీర్లు అమ్మకం

పందెం బరుల్లో ఏరులై పారిన మద్యం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పండుగ నాలుగు రోజులూ కిక్‌ గట్టిగానే ఎక్కింది. కోడి పందెం బరులు పెద్ద సంఖ్యలో ఏర్పాటుచేయడం.. అక్కడ మందు ఏరులై పారడంతో మం దుబాబులు తెగ తాగేశారు. మొహమాటాన్ని అడ్డుపెట్టి చుట్టాల గొంతుల్లోనూ పోసేశారు. బెల్టు షాపుల్లో కూడా నిరంతరం మందు అందుబాటులో ఉండ డంతో అడ్డూఅదుపూ లేకుండాపోయింది. దీంతో జిల్లాలో మద్యం అమ్మకాల కిక్కు ప్రభుత్వ ఖజానాను ఉర్రూతలూగించింది. సంక్రాంతి నాలుగు రోజుల మందు అమ్మకాలపై ఉన్నతాధికారులు ముందుగానే దృష్టి సారించారు. దీంతో మద్యం ద్వారా రెండు వారాల్లో సమకూరే సొమ్ము నాలుగు రోజుల్లోనే ప్రభుత్వ గళ్లాపెట్టెలోకి వచ్చేసింది. పండుగలు, పర్వదినాల్లో మద్యానికి లోటు రాకుండా చూస్తున్న ప్రభుత్వ లక్ష్యం బాగానే నెరవేరుతోంది. మరోవైపు మద్యం ధరలను ఇష్టానుసారం పెంచేస్తూ జనాల జేబులకు పాలకులు పెద్ద చిల్లులే పెడు తున్నారు. ఈ విపరీతమైన ధరలవల్ల మద్యం ప్రియులు కోట్లాది రూపా యలు నష్టపోతున్నారు. పండుగ ముందు రోజు తాజాగా 8పీఎం, మ్యాజిక్‌ మూమెంట్‌పై ప్రభుత్వం ధర పెంచింది. అంతకు ముందు కొన్ని బ్రాండ్లపై బాదేసింది. డిమాండ్‌ ఉన్న బ్రాండ్లకు ధరలు పెంచుతూ జనాలను మోసం చేస్తున్నారు. దీంతో గతంలో రూ.120కి దొరికే క్వార్టర్‌ ఇప్పుడు రూ.230 అయిపోయింది. బార్‌లో రూ.60-రూ.80 చెల్లించుకోవాల్సిందే. బీరు దారి మరీ దారుణం. గతంలో రూ.100కి దొరికే బీరుకు ఇప్పుడు రూ.330 వదుల్చుకోవాల్సి వస్తోంది. దీంతో మద్యం పై ప్రభుత్వ సంపాదన అమాంతం హద్దులు దాటి పరుగులు పెడుతోంది.

పండుగ తాగుడే..

తూర్పుగోదావరి 78, కోనసీమ 49, అల్లూరి సీతారామరాజు జిల్లా 18 కలుపుకొని 145 ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఉమ్మడి జిల్లాకు ఆదా యం సమకూరుతోంది. వీటికి 26 బార్లు అదనం. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా 13న లి క్కర్‌ 4283, బీర్లు 1099 కేసు లు.. 14న 6339, 2650.. 15న 6186, 2676.. 16న 5828, 1783 కేసులు విక్రయించారు. వీటికి బార్‌లలో అమ్మకాలను కూడా కలిపితే దాదాపు 25వేల కేసుల(కార్టర్‌, హాఫ్‌, ఫుల్స్‌) లిక్కర్‌, 1 లక్షా 20వేల బీర్లను జనాలకు ప్రభుత్వం పట్టించేసింది. సాధార ణంగా రోజుకు రూ.2 నుంచి రూ.3కోట్ల మద్యం విక్ర యాలు జరుగుతాయి. కానీ ఈ నాలుగు రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణా ల్లో చూస్తే 13న రూ.3.87 కోట్లు, 14న రూ.6.21కోట్లు, 15న రూ.6.16 కోట్లు, 16న రూ.5.71కోట్ల అమ్మకాలు జరిగాయి. వీటికి బార్లలో విక్రయాలు కలుపుకొంటే మద్యం రూపేణా సుమారు రూ.25కోట్ల సొమ్మును సం క్రాంతి సందర్భంగా మందుబాబులు ప్రభుత్వానికి ముట్టజెప్పారు. ఇక సారా అమ్మకాలనూ పరిగణనలోకి తీసుకుంటే మరో రూ.2కోట్లు మద్యంప్రి యులు గుటుక్కుమనిపించారని తెలుస్తోంది.

Updated Date - Jan 18 , 2024 | 01:18 AM

Advertising
Advertising