ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం
ABN, Publish Date - Jan 30 , 2024 | 01:30 AM
పెద్దాపురం, జనవరి 29: వార్డుల్లోకి వెళ్లలేక పోతున్నాం, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతు న్నాం ఇలా అయితే ఎలా అని మున్సిపల్ అధికా రులను పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు మంది రంలో సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు అ
పెద్దాపురంలో కౌన్సిలర్ల ఆవేదన
పెద్దాపురం, జనవరి 29: వార్డుల్లోకి వెళ్లలేక పోతున్నాం, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతు న్నాం ఇలా అయితే ఎలా అని మున్సిపల్ అధికా రులను పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు మంది రంలో సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు అధ్యక్షతన కౌన్సిల్ సధారణ సమావేశం జరిగింది. కౌన్సిలర్ అరెళ్ల వీర్రాఘవ రావు మాట్లాడుతూ సుమారు నాలుగేళ్లుగా తన వార్డులో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, ప్రజలకు తాము ఏం సమాధానం చెప్పాలన్నారు. కౌన్సిలర్ త్సలికి సత్యభాస్కరరావు మాట్లాడుతూ స్థానిక బూస్టర్ పాయింట్ వద్ద భవనం నిరుపయోగంగా ఉందని దానిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కౌన్సిలర్ ఆకుల కృష్ణబాపూజీ మాట్లాడుతూ సూరంపాలెం జగనన్న లేఅవుట్‌లో సమస్యలను పరిష్కరిం చాలని, రెండోవిడత టిడ్కో గృహాలను ఎప్పుడి స్తారని ప్రశ్నించారు. అనంతరం పలువురు సమస్యలపై ప్రశ్నించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి, డీఈ ఆదినారాయణ, శానిటరీ ఇనస్పెక్టర్ దావీదురాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 30 , 2024 | 01:30 AM