పారా లీగల్ వలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం
ABN, Publish Date - Dec 10 , 2024 | 01:26 AM
కొవ్వూ రు కోర్టు పరిధిలోని మండలాల నుంచి న్యాయ సేవా సహాయకులుగా (పారా లీగల్ వలంటీర్లు) పనిచేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మం డల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, 9వ అదనపు జిల్లా జడ్జి ఎం.అనురాధ తెలిపారు.
కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి అనురాధ
కొవ్వూరు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కొవ్వూ రు కోర్టు పరిధిలోని మండలాల నుంచి న్యాయ సేవా సహాయకులుగా (పారా లీగల్ వలంటీర్లు) పనిచేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మం డల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, 9వ అదనపు జిల్లా జడ్జి ఎం.అనురాధ తెలిపారు. దరఖాస్తుదారులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. రిటైర్డ్ టీచర్లు, లెక్చరర్‌లు, సీనియర్ సిటిజన్స్, సోషల్ వర్కర్స్, స్టూడెంట్స్, డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు పారా లీగల్ వలంటీర్లుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేసి, కొవ్వూరు కోర్టులో మండల లీగల్ సర్వీస్ కమిటీలో అందజేయాలన్నారు. దరఖాస్తు అందించడానికి ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉందన్నారు. వివరాలకు 08813-231188 నెంబరును సంప్రదించాలన్నారు. అనంతరం ఈ నెల 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో సోమవారం పోలీసు లు, న్యాయవాదులతో జిల్లా జడ్జి ఎం.అనూరాధ, డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ కె.రత్నప్రసాద్ సమావేశం నిర్వహించారు. రత్నప్రసాద్ పోలీస్టేషన్ల వారీగా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎన్ని కేసులు రాజీకి గుర్తించారని పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అలాగే న్యా యవాదులతో సమావేశం నిర్వహించి జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా సహకరించాలని సూచించారు.సమావేశంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్‌జడ్జి జి.సాయికృష్ణ, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కె.నాగలక్ష్మి, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జేడీటీఎస్ దేవి, కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్, సీఐలు, ఎస్‌ఐలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Updated Date - Dec 10 , 2024 | 01:26 AM