ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రకృతికి కృతజ్ఞతలు తెలపడమే పండుగలు

ABN, Publish Date - Jan 12 , 2024 | 01:05 AM

మనిషి మనుగడకు ప్రకృతే సర్వస్వం అని, అందుకు కృతజ్ఞతలు తెలపడమే పండుగలు అని నాట్యపండితుడు సప్పా దుర్గాప్రసాద్‌ అన్నారు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లలిత కళాసమితి ఆధ్వర్యంలో గురువారం మకర ఉత్సవ్‌ పేరిట నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన మాట్లాడారు.

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 11 : మనిషి మనుగడకు ప్రకృతే సర్వస్వం అని, అందుకు కృతజ్ఞతలు తెలపడమే పండుగలు అని నాట్యపండితుడు సప్పా దుర్గాప్రసాద్‌ అన్నారు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లలిత కళాసమితి ఆధ్వర్యంలో గురువారం మకర ఉత్సవ్‌ పేరిట నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన మాట్లాడారు. తల్లి వంటి తెలుగును మరువరాదని, పుట్టి పెరిగిన సంప్రదాయాన్ని మర్చిపోతే మానవజీవితానికి అర్థం ఉండదన్నారు. మెహందీ, రంగోలి, సంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహించారు. విజేతలకు చీరల సీతారామనాయుడు సహకారంతో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకురాలు స్వర్ణశ్రీ, లలిత కళాసమితి ఉపాధ్యక్షుడు పీవీబీ సంజీవరావు, సీపీడీసీ సభ్యులు జి.సత్యనారాయణ, అధ్యాపకులు డీవీ రమణమూర్తి, జి శరత్‌బాబు, జి.రమణ, సూపరింటెండెంట్‌ మేడూరి నరసింహ, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 01:05 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising