‘బరి’తెగించారు!
ABN, Publish Date - Jan 13 , 2024 | 12:41 AM
సంక్రాంతి వస్తుందంటే కోడిపందేల నిర్వాహకులు బిజీబిజీ.. ఔనన్నా కాదన్నా నిర్వాహకులు బరితెగిస్తారు.మూడు రోజులు పండగ చేసుకుంటారు.
అనుమతులకు ఎదురుచూపులు
డి.ముప్పవరంలో బరులకు ఏర్పాట్లు
నిడదవోలు, జనవరి 12 : సంక్రాంతి వస్తుందంటే కోడిపందేల నిర్వాహకులు బిజీబిజీ.. ఔనన్నా కాదన్నా నిర్వాహకులు బరితెగిస్తారు.మూడు రోజులు పండగ చేసుకుంటారు. అధికారపార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న కోడిపందేల బరులకు ప్రభుత్వ అధికారులు పూర్తిగా సహకారం అందించేస్తుంటారు. పైకి మాత్రం కోడిపందేలు వేసినా, చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినా చర్యలు తప్పవంటూ హెచ్చరికలు మాత్రమే జారీ చేస్తారు. ఎంత బలంగా హెచ్చరికలు చేస్తే అంత బరువుగా లబ్ధిని పొందుతారు. ఒకే గ్రామంలో అదీ ప్రధాన మార్గంలో మూడు బరులు సిద్ధమవుతున్నా అటువైపు చూసే అధికారులై కరు వయ్యారు. నిడదవోలు మండలం డి.ముప్పవరం నుంచి గోపవరం వెళ్ళే రోడ్డులో ప్రతీ ఏడాది కోడిపందేల బరులు వేస్తారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది మూడు బరులు అధికారపార్టీకి చెందిన నేతల కనుసన్నల్లో సిద్ధమవుతున్నాయి. అయితే అటువైపు చూసిన అధికారులే లేరు. పోనీ ఆదేదో మారుమూల ప్రాంతం కాదు. కొబ్బరితోటల్లో మట్టిని చదును చేసి బరులు సిద్ధం చేశారు. ఇక పైనుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అప్పటికప్పుడు బరుల చుట్టూ పెన్సింగ్, లైటింగ్, టెంట్లు యుద్ధప్రాతిపదిక సిద్ధమవుతాయి. ఇప్పటికే పోలీస్ రెవెన్యూ శాఖాధికారులు గ్రామాల్లో సభలు పెట్టి తూతూమంత్రంగా హెచ్చరికలు జారీచేయడమే తప్ప చిత్తశుద్ధితో కోడిపందేలు, గుండాట, కోతాట అరికట్టేందుకు చర్యలు చేపట్టడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనంగా ఉంది.ఇప్పటికైనా డి.ముప్పవరం బరులపై జిల్లా ఉన్నతాధికారు లు దృష్టి సారించి కోడిపందేలు నిరోధించాలని ప్రజలు కోరు తున్నారు.
పోతవరంలో బరి ధ్వంసం
నల్లజర్ల,జనవరి 12 : నల్లజర్ల మండలం పోతవరంలో కోడిపందేల బరి ధ్వంసం చేసినట్టు సీఐ కె.దుర్గా ప్రసాద్ తెలి పారు. పోతీనీడుపాలెం,పోతవరం గ్రామాల్లో గతంలో కోడి పందేలు వేసే ప్రదేశాలను శుక్రవారం పరిశీలించారు.పోతవరంలో బరి ఏర్పాటు చేయడంతో ధ్వం సం చేశామ న్నా రు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహ కు లను హెచ్చ రించారు. కోడి కత్తులు కట్టే వారిని గుర్తిస్తున్నామని,బరులు వేసి వారిని ఆదుపులోకి తీసు కుని కోడి పందాలు జరగకుండా అడ్డుకుంటామన్నారు.ఆయన వెంట ఎస్‌ఐ టీవీ. సురేష్,తహసీల్దార్ కిషోర్‌కుమార్ ఉన్నారు.
Updated Date - Jan 13 , 2024 | 12:41 AM