ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాకినాడ సాగరంలో అద్భుత విన్యాసాలు

ABN, Publish Date - Mar 30 , 2024 | 01:08 AM

ఇండియా-అమెరికా త్రివిధ దళాల సంయుక్త ఆఽధ్వర్యంలో నిర్వహిస్తున్న టైగర్‌ ట్రయంఫ్‌-24 యాంపిబీఎస్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలతోపాటు ఇండియా తురుపుముక్కలు ఐఎన్‌ఎస్‌ జలస్వ, కేసరి, ఐరావత్‌ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొని యుద్ధ సమయంలో శత్రుదేశాలపై చేసే వీరోచిత పోరాట ప్రదర్శన, విపత్తులు, ఆపద సమయంలో మానవతా సహాయం అందించే రిస్క్యూ సమయంలో అందించే సేవలు ప్రదర్శించారు.

బీచ్‌లో దాడుల్లో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది

  • ఆకట్టుకున్న టైగర్‌ ట్రయంఫ్‌-24 విన్యాసాలు

  • పాల్గొన్న ఇండో-అమెరికా యుద్ధ నౌకలు

సర్పవరం జంక్షన్‌, మార్చి29: ఇండియా-అమెరికా త్రివిధ దళాల సంయుక్త ఆఽధ్వర్యంలో నిర్వహిస్తున్న టైగర్‌ ట్రయంఫ్‌-24 యాంపిబీఎస్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలతోపాటు ఇండియా తురుపుముక్కలు ఐఎన్‌ఎస్‌ జలస్వ, కేసరి, ఐరావత్‌ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొని యుద్ధ సమయంలో శత్రుదేశాలపై చేసే వీరోచిత పోరాట ప్రదర్శన, విపత్తులు, ఆపద సమయంలో మానవతా సహాయం అందించే రిస్క్యూ సమయంలో అందించే సేవలు ప్రదర్శించారు. కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట నేవెల్‌ ఎన్‌క్లేవ్‌లో ఎక్స్‌ టైగర్‌ ట్రయం ఫ్‌-24 సీ ఫేజ్‌లో భాగంగా భారత్‌-అమెరికా యాంపిబీఎస్‌ విన్యాసాల్లో భాగంగా గత మూడు రోజులుగా ఇండియా నుంచి 700 మంది, అమెరికా నుంచి 400 మంది సభ్యులు విన్యాసాల్లో పాల్గొని యుద్ధ సమయంలో నిర్వహించే విధులను పోరాట పటిమను ప్రదర్శించారు. భారత్‌ భూభాగంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు, భూ భాగం ఆక్రమణకు ప్రయత్నిస్తున్న శత్రుదేశంపై త్రివిధ దళాలు దాడులు చేసి, శత్రువు శిబిరాలపై ఆకాశ, జల, భూభాగంపై నుంచి మెరుపు దాడులతో ఆటకట్టించింది. భారతదేశ తూర్పునావికా దళా నికి చెందిన ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌, కేసరి, ఐఎన్‌ఎస్‌ జలస్వ ఈ మూ డు యుద్ధ నౌకలు సహా అమెరికాకు చెందిన సోమర్‌సెట్‌ యుద్ధ నౌకతోపాటు త్రివిధ దళాలు శత్రుదేశ దురాక్రమణ, ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకుని సమర్థవంతంగా తిప్పికొట్టారు. అలాగే తుపాన్లు, విపత్తుల సమయంలో అందించే సేవలను ఈ విన్యాసా ల్లో సిబ్బంది ప్రదర్శించారు. ఐఎన్‌ఎస్‌ జలస్వ, ఐరావత్‌, కేసరి యు ద్ధనౌకల్లో నుంచి సిబ్బంది, హెలికాఫ్టర్లు, మెకనైజ్డ్‌ లాంగ్‌ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌లు, ల్యాండింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ డాక్‌, ల్యాండింగ్‌ షిప్‌ ట్యాంకు లు, శాన్స్‌ ఎయిర్‌క్రాప్ట్‌, మెకనైజ్డ్‌ ఫోర్సెస్‌తో భారీ వెసల్స్‌, జెమినీ బోట్లు, జెట్‌లు, యుద్ధ ట్యాంకర్లు, బంకర్లలలో ఆర్మీ సిబ్బంది వెపన్లతో జల, భూఉపరితలం, ఆకాశమార్గాల ద్వారా నిర్వహించిన విన్యాసాలు వారెవ్వా అనిపించాయి. అలాగే అమెరికా నుంచి సమగ్ర ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ ఎయిర్‌ కుషన్‌లు, హెలికాఫ్టర్లతో కూడిన ల్యాం డింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ డాక్‌, డిస్ట్రాయర్‌, లాంగ్‌ రేంజ్‌ మేరిటైమ్‌ రికనైసెన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ల్యాప్‌షిప్‌ మెడియేట్‌ పాల్గొన్నాయి.

  • ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం

సైనిక విన్యాసాల ద్వారా ఇండియా-అమెరికా దేశాల మధ్య బలమైన, వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని ఆర్‌ఏడీఎం మార్టినెజ్‌ మేజర్‌ జనరల్‌ (54వ డివిజన్‌) అఖిలేష్‌కుమార్‌, నేవీ కమాండెంట్‌ రాజేష్‌ ధన్‌కర్‌, అమెరికా కాన్సిల్‌ జనరల్‌ జన్నీఫర్‌ లార్సన్‌లు అన్నారు. టైగర్‌ ట్రయంఫ్‌-24 విన్యాసాల్లో ముఖ్య అతి థిగా హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇరు దేశాల త్రివిధ దళాల సామర్థ్యాల పెంపు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రణాళికలు నిర్వహించేందుకు ఈ విన్యాసాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఉభయచర, మానవతా సహాయం, విపత్తు ఉపశమనం తదితర అంశాలపై నిర్వహించిన విన్యాసాలతో నైపుణ్యాలు మరిం త పెరుగుతాయన్నారు. ఈ విన్యాసాలు ఈనెల 18 నుంచి 24 వర కు వైజాగ్‌ హార్బర్‌ బేస్డ్‌ విన్యాసాలు, 26 నుంచి 29వ వరకు సము ద్రం (సీబేస్డ్‌) యాక్టవిటీస్‌ చేపట్టడం జరిగిందన్నారు. కాకినాడలో సైనిక విన్యాసాలకు అన్ని విధాలా అనువైన ప్రాంతమని చెప్పారు.

Updated Date - Mar 30 , 2024 | 01:08 AM

Advertising
Advertising