25న జాతీయ ఓటర్ల దినోత్సవం : కమిషనర్
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:18 PM
కార్పొరేషన్ (కాకినాడ) జనవరి 18: ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు కాకినాడ సిటీ నియోజకవర్గం ఈఆర్వో, నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్.నాగనరసింహరావు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏఈఆర్వోలు, వివిధ వర్గాల ప్రజాప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఓటు విలువను ప్రజలకు తెలియజెప్పడం, ఓటుహక్కును వినియోగించుకోవ
కార్పొరేషన్ (కాకినాడ) జనవరి 18: ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు కాకినాడ సిటీ నియోజకవర్గం ఈఆర్వో, నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్.నాగనరసింహరావు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏఈఆర్వోలు, వివిధ వర్గాల ప్రజాప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఓటు విలువను ప్రజలకు తెలియజెప్పడం, ఓటుహక్కును వినియోగించుకోవడం వంటి అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ అంశాల ప్రాధాన్యత తెలియజెప్పేలా వ్యాసరచన, వక్తుృత్వం, షార్ట్‌ఫిలిమ్ పోటీలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. 25న వివేకానంద పార్కు నుంచి పీఆర్ కాలేజ్ వరకు ఓటర్‌వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం పీఆర్ కాలేజీలో జాతీయ ఓటర్ల దినోత్సవంలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈఆర్వోలు సీతాపతిరావు, వరహాలయ్య, హరిదాసు, నాగశాస్త్రులు, జాన్‌బాబు, మురళికృష్ణ, మేనేజర్ కర్రి సత్యనారాయణ, సీపీఆర్వో మానేకృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న కులగణన పారదర్శకంగా నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. స్టార్‌సిటీ కార్యాలయంలో గురువారం కులగణనపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ అదికారులు అడ్మిన్‌సెక్రటరీలు, ఎడ్జ్యుకేషనల్ డేటా ప్రోససింగ్ సెక్రటరీలు హాజరయ్యారు.
Updated Date - Jan 18 , 2024 | 11:18 PM