ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైవేపై హాయిగా..

ABN, Publish Date - Nov 26 , 2024 | 12:50 AM

కాకినాడ సెజ్‌తోపాటు యాంకరేజ్‌, డీప్‌ వాటర్‌ పోర్టుల చుట్టూ జాతీయ రహదారి విస్త రణ ప్రణాళికలు శరవేగంగా రూపుదిద్దుకుంటు న్నాయి. భవిష్యత్తులో వీటినుంచి ఎగుమతుల వ్యాపారం, ప్రాంతీయ అభివృద్ధి భారీగా జరిగే లా కేంద్రం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు కదులు తోంది. వాస్తవానికి కాకినాడ నగరం, దీన్ని ఆను కుని ఉన్న పోర్టులు హైవేకు దూరంగా ఉండ డంతో ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానం తక్కువగా ఉంది.

సామర్లకోట వద్ద ఆర్వోబీ పనులు

  • వాకలపూడి-అన్నవరం హైవే నిర్మాణ పనులకు ఎట్టకేలకు మార్గం సుగమం

  • 40.62కి.మీ.మేర కొత్త హైవే నిర్మాణానికి 90శాతం పూర్తయిన భూసేకణ

  • వచ్చేనెల 4లోపు రూ.వెయ్యి కోట్లతో పనులకు టెండర్లు ఖరారయ్యే అవకాశం

  • ఇప్పటివరకు ఆరు మండలాల్లో 500 ఎకరాల భూసేకరణకు రూ.250కోట్ల వరకు వ్యయం

  • 2026నాటికి హైవేను పూర్తిచేసి ఎన్‌హెచ్‌-16కు అనుసంధానం

  • ఇది పూర్తయితే కాకినాడ పోర్టులు, సెజ్‌కు పెరగనున్న కనెక్టవిటీ

  • వచ్చే ఏడాది సెప్టెంబర్‌నాటికి సామర్లకోట-కాకినాడపోర్టు పనులు పూర్తి

  • రూ.540కోట్లతో మొదటిప్యాకేజీ 40ు, రెండోప్యాకేజీ 70ు పనులు పూర్తి

కాకినాడ సెజ్‌తోపాటు యాంకరేజ్‌, డీప్‌ వాటర్‌ పోర్టుల చుట్టూ జాతీయ రహదారి విస్త రణ ప్రణాళికలు శరవేగంగా రూపుదిద్దుకుంటు న్నాయి. భవిష్యత్తులో వీటినుంచి ఎగుమతుల వ్యాపారం, ప్రాంతీయ అభివృద్ధి భారీగా జరిగే లా కేంద్రం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు కదులు తోంది. వాస్తవానికి కాకినాడ నగరం, దీన్ని ఆను కుని ఉన్న పోర్టులు హైవేకు దూరంగా ఉండ డంతో ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానం తక్కువగా ఉంది. దీంతో పారిశ్రామిక పరంగా ను ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేప థ్యంలో చెన్నై-కోల్‌కతా 16వనెంబరు జాతీయ రహదారిని అనుసంధానిస్తూ కొత్త హైవే విస్త రణ ప్రణాళికలకు హైవే అథారిటీ వేగంగా కస రత్తు చేస్తోంది. అందులోభాగంగా కాకినాడ వాకలపూడి నుంచి అన్నవరం వరకు రూ.వెయ్యి కోట్లతో కొత్తగా హైవేను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 90శాతం భూసేకరణ పూర్తికావడంతో వచ్చే నెల 4నాటికి టెండర్లను ఖరారు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అటు ఏడీబీ రోడ్డుపై సామర్లకోట నుంచి అచ్చంపేట, అచ్చంపేట నుంచి కాకినాడపోర్టుకు రెండు ప్యాకేజీల కింద రూ.540కోట్లతో మొదలుపెట్టిన పనులు ఇటీవల వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబరునాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి.

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

సుదీర్ఘ సాగరతీరం కలిగి ఉన్న కాకినాడ పారిశ్రామికపరంగా ఎదిగేందుకు ఎన్నో అవకా శాలున్నాయి. కానీ ఎక్కడో మూలన ఉండడం, ప్రధాన జాతీయ రహదారికి దూరం కావడంతో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. కాకినాడలో రాష్ట్రప్రభుత్వానికి చెందిన యాంకరేజ్‌ పోర్టు, ప్రైవేటు కంపెనీల అధీనంలోని డీప్‌వాటర్‌ పోర్టు ఉన్నాయి. పైగా ఎన్నో ఏళ్ల కిందట పదివేల ఎక రాల్లో కాకినాడ సెజ్‌ సైతం ఏర్పాటైంది. దేశం లోనే ఇది అత్యంత పెద్ద సెజ్‌. మరో రెండేళ్లలో సెజ్‌లో కొత్తగా మరో ఓడరేవు కూడా రాబోతోం ది. అటు విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నడ వాలో కూడా కాకినాడ కూడా ఉంది. అభివృద్ధికి ఎంతో కీలక అవకాశం ఉన్న కాకినాడకు రోడ్డు కనెక్టవిటీ అనుకున్నంతగా లేదు. దీంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాకినాడలో రెం డు పోర్టులకు, సెజ్‌కు విశాఖ పోర్టు, అటు అన కాపల్లి జిల్లాలోని నక్కపల్లి పారిశ్రామిక, ఫార్మా ప్రాంతాల నుంచి భారీగా కార్గో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ కార్గో అన్నవరం హైవే మీదుగా కత్తిపూడి నుంచి పిఠాపురం మీదుగా కాకినాడ రావాలి. దీనికి ఎంతో వ్యయభారం.పైగా పలు పట్టణాలు కూడా మధ్యలో ఉండడంతో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు కాకినాడపోర్టు, సెజ్‌కు అను సంధానం తక్కువగా ఉంటోంది. పైగా పారి శ్రామికపరంగాను సెజ్‌, పోర్టులు ఎదగాలంటే ప్రత్యేక హైవే అవసరమని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టులకు సమీపంలో ఉన్న వాకలపూడి నుంచి అన్నవరం బైపాస్‌ వర కు 40.62 కిలోమీటర్ల మేర హైవే నిర్మించాలని కేంద్రం కొన్నేళ్ల కిందట ప్రతిపాదించింది. ఇందు కు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ హైవే నిర్మాణ పనులు కాకినాడ రూరల్‌, యు.కొత్తపల్లి, తొండంగి, శంఖవరంతో కలిపి మొత్తం ఆరు మండలాల్లో 21 గ్రామాల్లో 562ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇందులో 500ఎకరాలు పూర్తిగా ప్రైవేటు భూములే. వీటి సేకరణకు అనేక చిక్కులు రావడంతో రెండేళ్లు పైనే సేకరణకు పట్టింది. ప్రధానంగా వాకలపూడి నుంచి యు.కొత్తపల్లి, తొండంగి మీదుగా అన్న వరం బైపాస్‌ వరకు అతికష్టంపై రెవెన్యూ అధి కారులు భూసేకరణ ప్రక్రియను తాజాగా కొలిక్కి తీసుకువచ్చారు. 90శాతం భూమిని సేకరించి హైవే అఽథారిటీకి అప్పగించారు. దీంతో ఈ హైవే పనులకు సంబంధించి అతిపెద్ద చిక్కుముళ్లు వీడినట్లయింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ అధికారుల నుంచి రూ.230కోట్ల వరకు భూసేకరణకు నిధు లు వెచ్చించారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల ప్రతిపాదనలకు ఎట్టకేలకు మార్గం సుగమం అవ డంతో ఈ రహదారి నిర్మాణానికి తాజాగా కేంద్ర రహదారులశాఖ టెండర్లు పిలిచింది. వచ్చే నెల 4న వీటిని ఖరారు చేయనుంది. వాస్తవానికి భూ సేకరణ సమస్య వీడడంతో వచ్చే నెలకు టెండర్లు ఖరారు చేసి 2026నాటికి హైవేను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈహైవేను చెన్నై-కోల్‌కతా ఎన్‌హెచ్‌-16కు అన్నవరం వద్ద అనుసంధానించనున్నారు. తద్వారా నేరుగా అన కాపల్లి జిల్లా నుంచి భారీ ఫార్మా కార్గో సైతం కాకినాడలోని ఓడరేవులకు, ఇక్కడి కార్గో ఇతర ప్రాంతాలకు సులువుగా ఎగుమతి, దిగుమతులు చేయడానికి వీలుపడుతుంది. అన్నవరం నుంచి కత్తిపూడి మీదుగా కాకినాడకు ద్విచక్రవాహనా లు, కార్లలో వచ్చే వారికి సమయం అధికంగా తీసుకుంటోంది. అన్నవరం నుంచి వాకలపూడికి భవిష్యత్తులో నిర్మాణం కానున్న హైవే ద్వారా చాలాతక్కువ దూరం,సమయంలో చేరుకోవచ్చు.

హమ్మయ్య.. ఆ బాధ తీరినట్లే..

కాకినాడ యాంకరేజ్‌, డీప్‌వాటర్‌ పోర్టుకు రా ష్ట్రంలో అనేక జిల్లాలతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాల నుం చి వందలాది లారీలు బియ్యం ఎగుమతుల కో సం వస్తుంటాయి. అటు భారీ గ్రానైట్‌ రాళ్లు సై తం వందలాది లారీలు ఏడీబీ రోడ్డుమీదుగా కాకి నాడమీదుగా పోర్టుకు రాకపోకలు సాగిస్తుంటా యి. వందలాది లారీలు ఏడీబీ రోడ్డులో సామర్ల కోటకు రాగానే పోర్టు వరకు రహదారి పూర్తిగా నరకప్రాయంగా ఉండడంతో నరకం చూస్తున్నా యి. వాహనాలు పాడైపోవడంతోపాటు సమ యం భారీగా వృథాఅవుతోంది. రహదారి అత్యం త ఇరుగ్గా ఉండడంతో పోర్టుకు వెళ్లడానికి తల నొప్పిగా మారింది. కాకినాడలోని అచ్చంపేట జం క్షన్‌ మీదుగా ఇవన్నీ పోర్టుకు వెళ్లాలి. తీరా నగ రంలో ట్రాఫిక్‌ తీవ్రత కారణంగా పలు సమ స్య లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సామర్ల కోటనుంచి కాకినాడ పోర్టు వరకు ప్రస్తుతం ఉన్న ఇరుకు రోడ్డును నాలుగు వరుసలుగా విస్త రించే పనిని హైవే అధికారులు గతేడాది ప్రారం భించగా అవన్నీ ఇప్పుడు చురుగ్గా సాగుతున్నా యి. మొత్తం రెండు ప్యాకేజీల కింద 26 కిలో మీటర్ల మేర నాలుగు వరుసల రహదారి పను లు వేగంగా కదులుతున్నాయి. ప్యాకేజీ-1 కింద సామర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్‌ వరకు ఏడీబీ రోడ్డును సామర్లకోట పట్టణం నుంచి త ప్పించి రాక్‌సిరామిక్‌ నుంచి ఎఫ్‌సీఐ గోదాము, షుగర్‌ ఫ్యాక్టరీ వెనుక నుంచి గోదావరి కాలువ మీదుగా సామర్లకోట ప్రస్తుత రోడ్డుకు కలుపను న్నారు. ఇందుకోసం రాక్‌సిరామిక్‌వద్ద ఆర్వోబీ పని 40శాతం పూర్తయింది. ప్యాకేజీ-1 కింద సామర్లకోట నుంచి అచ్చంపేట వరకు 12.25 కి లోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇవి వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తికానున్నాయి. ప్యాకేజీ-2 కింద అచ్చం పేట జంక్షన్‌ నుంచి కాకినాడ యాంకరేజ్‌ పోర్టు వరకు 13.2 కిలోమీటర్లు నాలుగు లేన్ల రహదారి పనులు 70శాతం పూర్తయ్యాయి. ఆర్కే ఇన్‌ఫ్రా కంపెనీ ఈపనులు దక్కించుకోగా అచ్చంపేట జంక్షన్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ఇవి 2025 ఏప్రిల్‌కు పూర్తికానున్నాయి.

Updated Date - Nov 26 , 2024 | 12:50 AM