పి.గన్నవరం జనసేన ఇన్‌చార్జిగా గిడ్డి సత్యనారాయణ
ABN, First Publish Date - 2024-02-06T00:52:53+05:30
పి.గన్నవరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జిగా గిడ్డి సత్యనారాయణను నియమిస్తూ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సోమవారం రాత్రి నియామక ఉత్తర్వులు అందించినట్లు ఉమ్మడి జిల్లాల జనసేన ఉపాధ్యక్షుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు తెలిపారు.
పి.గన్నవరం, ఫిబ్రవరి 5: పి.గన్నవరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జిగా గిడ్డి సత్యనారాయణను నియమిస్తూ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సోమవారం రాత్రి నియామక ఉత్తర్వులు అందించినట్లు ఉమ్మడి జిల్లాల జనసేన ఉపాధ్యక్షుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు తెలిపారు. పి.గన్నవరం మండలం ఉడిమూడి శివారు ఉడిమూడిలంక గ్రామానికి చెందిన సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రం పోలీస్‌శాఖలో ఏవోగా పనిచేశారు. ఇటివలే తన ఉద్యోగానికి రాజీనామ చేసి సోమవారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. పార్టీకోసం కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని అధినేత పవన్‌కల్యాణ్ సూచించినట్లు గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లాల పార్టీ కార్యదర్శి వాసంశెట్టి కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, దొమ్మేటి సాయికృష్ణ, సాధనాల శ్రీవెంకటసత్యనారాయణ, జాలెం శ్రీనివాసరాజా, నాయకులు యల్లమిల్లి చిట్టిబాబు, అడబాల తాతకాపు, సలాది బుచ్చిరాజు, తాటికాయల శ్రీనివాస్ ఉన్నారు.
Updated Date - 2024-02-06T00:52:55+05:30 IST