ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేటి నుంచి జీఎన్‌ఎం పరీక్షలు

ABN, Publish Date - Jan 03 , 2024 | 01:16 AM

జీజీహెచ్‌ (కాకినాడ) జనవరి 2: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఈనెల 11 వరకు జరగనున్నాయి. కాగా గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ పరీక్షలు జరిగేవి. అయితే రద్దీ పెరిగిపోయిన దృష్ట్యా ప్రస్తుతం ఈ పరీక్షలను కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలలో నిర్వహించనున్నారు.

జీజీహెచ్‌ (కాకినాడ) జనవరి 2: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఈనెల 11 వరకు జరగనున్నాయి. కాగా గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ పరీక్షలు జరిగేవి. అయితే రద్దీ పెరిగిపోయిన దృష్ట్యా ప్రస్తుతం ఈ పరీక్షలను కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలలో నిర్వహించనున్నారు. మొత్తం 53 నర్సింగ్‌ స్కూల్స్‌కు సంబంధించి 32 స్కూళ్లకు చెందిన 1700 మంది నర్సింగ్‌ విద్యార్థులు రంగరాయ వైద్య కళాశాలలోను, 10 స్కూళ్లకు చెందిన 350 మంది రాజమహేంద్రవరం మెడికల్‌ కాలేజీలోను, 11 నర్సింగ్‌ స్కూళ్లకు చెందిన 450 మంది విద్యార్థులు అమలాపురం కిమ్స్‌ మెడికల్‌ కాలేజీలోను పరీక్షలు రాయనున్నారు. బుధవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జీఎన్‌ఎం ప్రఽథమ సంవత్సరం, మధ్యహ్నం 2 నుంచి 5 గంటల వరకు తృతీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరగనుండ గా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గురువారం నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. జీజీహెచ్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ ఎస్‌ లావణ్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షల నిర్వహణ కోసం 25 మంది పరిపాలన విభాగ సిబ్బంది ఇన్విజిలేటర్‌లుగా వ్యవహరించనున్నారు. విద్యార్థుల సౌలభ్యత కోసం ఆరుగురు అటెండర్‌లను నియమించారు. సీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ పుష్కర్రావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ రాహుల్‌ ఈ పరీక్షలను పర్యవేక్షించనున్నా రు. అలాగే చీఫ్‌ ఎగ్జామినర్‌గా ప్రభుత్వం నర్సింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆషాదేవి వ్యవహరించనున్నారు. విద్యార్థులు స్లిప్‌లతో దొరికినా, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినా డీబార్‌ చేయడంతోపాటు మరోసారి పరీక్ష రాసేందుకు అనర్హులవుతారని డాక్టర్‌ లావణ్యకుమారి హెచ్చరించారు. క్లినికల్స్‌ చేయని ఏ విద్యార్థినీ పరీక్ష రాసేందుకు అనుమతించబోమని చెప్పారు.

Updated Date - Jan 03 , 2024 | 01:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising