ఉచిత న్యాయ సేవలకు డయల్ 15100
ABN, Publish Date - Nov 09 , 2024 | 12:38 AM
న్యా యపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే టోల్‌ఫ్రీ నెంబరు 15100ను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కె.ప్రకాష్‌బాబు తెలిపారు. జిల్ల్లా కోర్టు ఆవరణంలో డీఎల్‌ఎస్‌ఏ భవనంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేడు జీఎస్‌కెలో న్యాయసేవాదినోత్సవం
డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ప్రకాష్‌బాబు
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 8( ఆంధ్రజ్యోతి): న్యా యపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే టోల్‌ఫ్రీ నెంబరు 15100ను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కె.ప్రకాష్‌బాబు తెలిపారు. జిల్ల్లా కోర్టు ఆవరణంలో డీఎల్‌ఎస్‌ఏ భవనంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక జీఎస్‌కే న్యాయ కళాశాలలో ఈనెల 9న జిల్లా న్యాయసేవా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్యోద్దేశమన్నారు. ఉచిత న్యాయసహాయం అవసరమైన వారికి సలహాలు, మధ్యవర్తిత్వం, సామరస్యం ద్వారా కేసులు పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో న్యాయసేవాధికార సంస్థలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పేదవాడికి న్యాయాన్ని అందించే దిశగా పారా లీగల్ వలంటీర్లు, ప్యానల్ లాయర్లు, అత్యున్నత స్థాయిలో ఉన్న న్యాయవాదులు కొంత ఫీజును కూడా తగ్గించుకొని పేదల కోసం వాదిస్తారని చెప్పారు. కాగా వచ్చే నెల 14న జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ప్రకాష్‌బాబు తెలిపారు. ఇందులో క్రిమినల్, సివిల్, యాక్సిడెంట్, కుటుంబ వివాదాలు, చిట్ పండ్స్ వివాదాలు, బ్యాంకు లావాదేవీల కేసులు, టెలిఫోను బకాయిలు, మునిసిపల్ ఆస్తి, నీటి పన్నుల కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని చెప్పారు.
Updated Date - Nov 09 , 2024 | 12:38 AM