ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఊరంతా పండగ..

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:40 AM

ఊరంతా పండగే.. ఎక్కడెక్కడి నుంచో జనం కదిలొచ్చారు.. గౌరీశంకరుల రథోత్సవం కన్నులారా తిలకించారు.

గౌరీ శంకరుల రథోత్సవానికి హాజరైన భక్తజనం

కోరుకొండ, జనవరి 17 : ఊరంతా పండగే.. ఎక్కడెక్కడి నుంచో జనం కదిలొచ్చారు.. గౌరీశంకరుల రథోత్సవం కన్నులారా తిలకించారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో బుధవారం గౌరీశంకరుల రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రథోత్సవానికి ముందు గ్రామానికి చెందిన ఆడబడుచులు సుమారు వెయ్యి మంది అమ్మవారికి సారె, చీరలు తీసుకెళుతూ గ్రామం అంతా ఊరేగిం చారు.. ఈ సారె ఊరేగింపులో టీడీపీ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌద రి, జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి, వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి గ్రామస్తులతో కలిసి సారె ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం గౌరీచౌక్‌ వద్ద రథానికి ప్రత్యేక పూజలు చేసి రథోత్సవం ప్రారంభించారు.సుమారు 24 గంటలు పాటు నిర్విరామంగా రథోత్సవం సాగు తోంది. సారె తీసుకొచ్చిన 1000 మంది మహిళలకు జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి జాకెట్‌ ముక్కలు పంపిణీ చేశారు. అమ్మవారికి స్వీట్లు, పండ్లు, పువ్వులు అందజేశారు.

Updated Date - Jan 18 , 2024 | 12:40 AM

Advertising
Advertising