ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లెకు..పండుగేది!

ABN, Publish Date - Nov 25 , 2024 | 12:09 AM

కనిపించేదంతా నిజం కాదు... అలాగని చెబుతున్న మాటలు నిజం కాదు..దీనికి ఇదే ఉదాహరణ. పల్లె పండుగ కార్యక్రమాన్ని గత నెల 2వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు.. గ్రామాల్లో డ్రెయినేజీలు.. సీసీ రోడ్ల అభివృద్ధి పథకం లక్ష్యం.. అయితే అధికారుల లెక్కల ప్రకా రం అన్ని చోట్లా పనులు ఆరంభమైపోయాయి..

గోపాలపురం గ్రామంలో వేస్తున్న రోడ్డు..

అరకొరగా ఆరంభం

జిల్లాకు 651 పనులు మంజూరు

ముందుకు సాగని డ్రైనేజీ నిర్మాణాలు

రోడ్డు పనుల్లోనూ జాప్యం

లెక్కల్లో చూస్తే ఆరంభం

క్షేత్రస్థాయిలో చూస్తే వెనుకడుగే

కిందిస్థాయి అధికారుల అలసత్వం

పనుల్లో వెనుకబడిన తాళ్ళపూడి

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కనిపించేదంతా నిజం కాదు... అలాగని చెబుతున్న మాటలు నిజం కాదు..దీనికి ఇదే ఉదాహరణ. పల్లె పండుగ కార్యక్రమాన్ని గత నెల 2వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు.. గ్రామాల్లో డ్రెయినేజీలు.. సీసీ రోడ్ల అభివృద్ధి పథకం లక్ష్యం.. అయితే అధికారుల లెక్కల ప్రకా రం అన్ని చోట్లా పనులు ఆరంభమైపోయాయి.. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం చాలా చోట్ల ఇంకా ఆరంభమే కాలేదు. పోనీ ఆరంభమైన చోటయినా వేగంగా సాగుతున్నాయా అంటే అదీ లేదు.. అక్కడా నత్తనకడే.. ఇలా చేస్తే సంక్రాంతికి పనులు పూర్తవడం ప్రశ్నార్థకమే. సంక్రాంతి పండగ నాటికి పల్లెలన్నీ సీసీ రోడ్ల తో కళకళలాడాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంపై అధి కారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులు నత్తనడక సాగుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఒకే రోజు గ్రామసభలు నిర్వహించి పనులకు తీర్మా నాలు కూడా చేయించిన సంగతి తెలిసిందే. తర్వాత సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 2 నుంచి పల్లె పండగ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెల్లోకి వెళ్లి గ్రామసభల్లో తీర్మానం చేసిన పలు పనులకు శంకుస్థాపనలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ సంక్రాంతి నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడంలేదు. కొన్ని చోట్ల మొదలైన పనులు వేగవంతంగా జరుగుతుంటే, కొన్ని ప్రాంతాల్లో అసలు ఆరం భమే కాలేదు. కొన్ని సీసీ రోడ్ల నిర్మాణం సాగు తుంటే, ఇంకొన్ని చోట్ల ఇంకా శంకుస్థాపన కూడా చెయ్యని పరిస్థితి. కానీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి నిత్యం వెంటాడుతున్నారు. పనులు వేగవంతం చేయాలని, డిసెంబరు చివరికి పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చొరవ చూపుతున్నా కొన్ని సమస్యలు అడ్డంకిగా మారాయి. ఇసుక కొరత ఉంది. పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి ఇప్పటికే ఎంత ఇసుక కావాలనే ప్రతిపాదన సిద్ధమైంది.కానీ ఇంత వరకు ఎవరు ఏ ర్యాంపు నుంచి ఇసుక తెచ్చుకోవాలనే దానిపై స్పష్టత లేదు. పైగా పరోక్షంగా నామినేషన్‌ పద్ధతిలో ఈ పనులను ప్రజాప్రతినిధులు... పార్టీ కార్యకర్తల తోనే చేయిస్తున్నారు. కొందరు ముందుగా పెట్టు బడి పెట్టడానికి చొరవ చూపకపోవడం మరో కారణం. కార్యకర్తలు ఓ కాంట్రాక్టరుకు పనులు అప్పగించడం వల్ల ఒక పని తర్వాత మరొకటి చేసుకోవచ్చనే ధోరణి వల్ల కూడా సమస్య ఉంది. అన్ని గ్రామాల్లో ఒకేసారి మొదలైతే డిసెంబరు చివరి వరకూ కూడా అవసరం ఉండదు. క్షేత్ర స్థాయిలో అటువంటి పరిస్థితి లేదు.

జిల్లాకు 651 పనులు..

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు మొత్తం 651 పనులు మంజూరయ్యాయి.అవన్నీ సీసీ డ్రెయిన్లే. పంచా యతీరాజ్‌ శాఖ ద్వారా జరుగుతున్నాయి. గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యుఎస్‌) విభాగం ద్వారా రూ.30 కోట్ల విలువైన 100కు పైగా డ్రైన్లు శాంక్షన్‌ చేశారు. కానీ సాంకేతిక కారణాలతో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక పల్లె పండుగలో భాగంగా ప్రతి గ్రామం లోనూ సీసీ రోడ్లు నిర్మించాలన్నది లక్ష్యం. ప్రాధా న్యతను బట్టి పనులు కేటాయించారు. మొత్తం జిల్లాలో 130 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయను న్నారు. ఒక్కో కిలో మీటరుకు రూ.50 లక్షల వరకు అంచనా వేశారు. ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం 12.5 అడుగుల రోడ్డు నిర్మిం చాలి.ఇంకా 1నుంచి 3శాతం వరకు ప్రజాప్రతి నిధులు, ప్రజల కోరిక మేరకు నిర్మించవచ్చు. ఏడు అంగుళాల నుంచి 8 అంగుళాల మందం ఉండేలా చూడాలి.కానీ ఈ పనులన్నీ నామినేషన్‌ పద్ధతిలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలే చేస్తున్నట్టు సమాచారం.కార్యకర్తల పేర్లతో కాంట్రాక్టర్లు కూడా పనులు చేస్తున్నారు. జిల్లా లోని అన్ని మండలాల్లోనూ సీసీ రోడ్లు నిర్మిస్తు న్నారు. అనపర్తిలో 50 వర్కులు శాంక్షన్‌ అయ్యా యి. పనుల నిర్మాణం మొదలైనట్టు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. కానీ చాలా పనులు మొ దలు కాలేదు.కొన్నింటికి శంకు స్థాపన చేయలేదు. కొన్ని పనులకు సంబంధించి రోడ్లను శుభ్రం చేశారు. కొంత మట్టి వర్కు చేశారు. కంకర లేయర్లు వేశారు. కొన్నిచోట్ల సీసీ రోడ్లు వేశారు. కొన్నిచోట్ల ఆల్టర్నేట్‌ రోడ్లను ప్రతి పాదించారు. గోపాలపురంలో సీసీ రోడ్డు నిర్మా ణం పూర్తి చేశారు. కడియంలో నిర్మించారు. రాజమహేంద్రవరం రూరల్‌లో నాలుగు వర్కులు పూర్తయ్యాయి. పెరవలిలో రెండు గ్రామాల్లో జరు గుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌లో 92 వర్కుల్లో 74 వర్కులే మొదలు కానున్నాయి. మిగతా వర్కులకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనల కు పంపినట్టు సమాచారం.

అధికారుల కాగితాల్లో లెక్కలు

అధికారుల లెక్కల ప్రకారం మండలాల వారీ గా...కడియంలో 7 పనులకు అన్నీ మొదల య్యా యి.కోరుకొండలో 18, రాజమహేంద్రవరం రూర ల్‌లో 92 వర్కులకు 74, రాజానగరంలో 32 శాం క్షన్‌ కాగా అన్నీ మొదలయ్యాయి. రంగం పేటలో 44కి 43, బిక్కవోలులో 70కి 68, ఉండ్రా జవరంలో 54కి 52, గోకవరంలో 48కి 46, నిడద వోలులో 84కి 79, నల్లజర్లలో 38 కి 35, గోపా లపురంలో 12కి 11, చాగల్లులో 9కి 7, పెరవలిలో 42కి 32, దేవరపల్లిలో 18కి 13, కొవ్వూరులో 10కి 13, తాళ్లపూడిలో 17కి7 పనులు మొదలయ్యాయి. సీతానగరం మండలంలో ఒకే ఒక్క పని మం జూరు కాగా ఇంకా మొదలు కాలేదు. తాళ్లపూడి మండలం బాగా వెనుకబడి ఉంది.

Updated Date - Nov 25 , 2024 | 12:09 AM