కుక్కల బెడదను నివారించాలని సభ్యుల డిమాండ్
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:06 AM
గ్రామాల్లో కుక్కల బెడద అధికంగా ఉందని, వీటిని నివారించకపోతే రానున్న రోజుల్లో మరింత ప్రమాదం పొంచి ఉన్నట్లేనని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలమూరు, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో కుక్కల బెడద అధికంగా ఉందని, వీటిని నివారించకపోతే రానున్న రోజుల్లో మరింత ప్రమాదం పొంచి ఉన్నట్లేనని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలమూరు మం డల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన శనివారం జరిగింది. గ్రామాల్లో కుక్కల నివారణకు ఆంక్షలు ఉండటంతో, వాటి సంఖ్య గణనీయంగా పెరిగిపోయి దాడులకు దిగుతున్నాయని, ముఖ్యంగా చొప్పెల్ల, పెదపళ్ల, పీహెచ్‌సీలు, ఆలమూరు సీహెచ్‌సీలోను కుక్కల దాడిలో గాయపడిన వారి కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని, అందువల్ల వీటి నివారణపై ఏదో ఒకటి చేపట్టకపోతే ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నట్లు సర్పంచ్ సంగిత సుభాష్, గుణ్ణం రాంబాబు, ఎంపీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం కుక్కల నివారించడం వీలు కాదని, అయితే కుటుంబ నియంత్రణ ద్వారా సంఖ్యను తగ్గిం చే చర్యలు చేపట్టే పరిస్థితి ఉందని ఎంపీడీవో జాన్‌లంకన్, ఈవోపీఆర్డీ ఎ.రాజు వివరించారు. మండలంలో ఇటీవల ఏర్పాటుచేసిన మద్యం షాపుల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని, అయితే గ్రామానికి రెండు చోట్ల బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయడం వల్ల మద్యం పారుతుందని సభ్యులు ఆరోపించారు. బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎస్‌ఐ రాంబాబు వివరించారు. జడ్పీటీసీ తోరాటి సీతామహాలక్ష్మి, ఎంపీడీవో జాన్‌లింకన్, తహశీల్దార్ ప్రకాష్‌బాబు, ఈవోపీఆర్డీ ఎ.రాజు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 01:06 AM