ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసులమని భయపెట్టి.. రూ.4.15 లక్షలు లాగేశారు!

ABN, Publish Date - Dec 09 , 2024 | 12:48 AM

ముంబై క్రైమ్‌ పోలీసులుపేరుతో భయపెట్టి రాజమహేంద్రవరానికి చెందిన ఒక వ్యక్తి నుంచి రూ.4.15 లక్షలు దోచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వన్‌టౌన్‌లో కేసు నమోదు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 8( ఆంధ్రజ్యోతి) : ముంబై క్రైమ్‌ పోలీసులుపేరుతో భయపెట్టి రాజమహేంద్రవరానికి చెందిన ఒక వ్యక్తి నుంచి రూ.4.15 లక్షలు దోచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్‌టౌన్‌ పోలీసులు కథనం ప్రకారం. గత నెల 12న రాజమహేంద్రవరం జాంపేటకు చెందిన కె.ఆదిత్య ఫోన్‌కు ఒక కాల్‌ వచ్చింది. ఆ కాల్‌లో మాట్లాడిన వారు తాము ముంబై క్రైమ్‌ పోలీసులమని.. నీ అకౌంట్‌ నుంచి మనీలాండరింగ్‌ జరుగుతుందని నువ్వేం చేస్తున్నావని భయపెట్టారు. తనకు సంబంధంలేదని బాధితుడు చెప్పినా వినకుండా కాల్‌ కట్‌ చేసి వీడియోకాల్‌ చేసి పోలీస్‌ యూనిఫాంలో మాట్లాడారు. నీ అకౌంట్లు డిజిటల్‌ అరెస్టు చేశామని నిన్నుకూడా ఆదుపులోకి తీసుకుంటామని భయపెట్టడంతో ఆదిత్య హడలిపోయాడు. తనకు ఏవిధమైన సంబంధంలేదని సమాధానం ఇచ్చాడు. అయినా అవతల వ్యక్తి భయపెట్టి నిన్ను రక్షిస్తామని నీఅకౌంట్‌లో డబ్బును తాము చెప్పిన అకౌంట్‌కు జమచేయాలని చెప్పడంతో ఆలోచించకుండా రూ.4.15 లక్షలు అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసేశాడు.కొద్ది రోజుల త ర్వాత డిజిటల్‌ అరెస్టు అనేదానిపై ఆరా తీశా డు.అటువంటిది ఉండదని తెలుసుకున్న ఆది త్య తాను మోసపోయానని గ్రహించి ఐటీ పోలీస్‌ 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేశాడు. కేసును వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు బదలా యి ంచడంతో ఆదివారం కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 09 , 2024 | 12:48 AM