ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీల్లో అవినీతి!

ABN, Publish Date - Nov 25 , 2024 | 12:11 AM

నేటికీ అంతా మా ఇష్టం అంటు న్నారు..అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప..కనీసం కన్నెత్తి చూడడం లేదు. కొత్త ప్రభు త్వం ఏర్పడి 5 నెలలు అవుతున్నా అధికారుల తీరు నేటికీ గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారు.

వదలని మామూళ్ల మత్తు

లంచమిస్తేనే జీతాలు

300 పంచాయతీల్లో ఇదీ తీరు

జిల్లా సిబ్బంది 10 వేలు

వసూళ్లు రూ.1.50 కోట్లు?

కిందిస్థాయి సిబ్బంది గగ్గోలు

ఇష్టానుసారం నియామకాలు

అయినా పట్టని అధికారులు

నేటికీ తేలని అసలు లెక్క

రాజమహేంద్రవరం రూరల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నేటికీ అంతా మా ఇష్టం అంటు న్నారు..అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప..కనీసం కన్నెత్తి చూడడం లేదు. కొత్త ప్రభు త్వం ఏర్పడి 5 నెలలు అవుతున్నా అధికారుల తీరు నేటికీ గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారు. తీరు మారలేదు.. అవినీతి ఆగలేదు. యథేచ్ఛగా దోపిడీ సాగుతూనే ఉంది. పంచాయతీల్లో ఇదీ మరీ ఎక్కువగా ఉంది. జిల్లాల విభజన జరిగినా అవినీతిని రూపుమాపడం.. అక్రమాలను అడ్డుకో వడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కన బడుతోంది. పంచాయతీల్లో సిబ్బందికి పోస్ట్‌ శాం క్షన్‌ ఆర్డర్‌ లేకుండానే జీతాలు వెళ్లిపోతున్నా ఎం దుకో మరీ నేటికీ ఏమీ తెలియనట్టు ఉన్నారు..

రెండేళ్లకోసారి దోపిడీ..

ఏ పంచాయతీలో అయినా పోస్ట్‌ శాంక్షన్‌ ఆర్డరు ఉంటేనే పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించాలి.ప్రతి రెండేళ్లకోసారి జిల్లా పంచాయతీ అధికారులు రెన్యువల్‌ చేస్తారు. జిల్లాలో చాలా పంచాయతీల్లో ఇవేమి లేకుండానే చెల్లింపులు చేస్తున్నారు.అయితే ఆర్డరు లేని సిబ్బంది తీరు ఇలా ఉంటే.. ఆర్డరు ఉన్న సిబ్బందీ ఆమ్యామ్యా చెల్లించాల్సిందే.ఆర్డరు రెన్యువల్‌ కావాలంటే ప్రతి కార్మికుడు(సిబ్బంది)రూ.1500 నుంచి రూ.3 వేల వరకు చెల్లించాలి. దీనిని బట్టే ప్రతి సంవత్సరం జీతాల పెంపుదల ఉంటుంది. ఒక యూనియన్‌ నాయకుడు సిబ్బంది వద్ద నుంచి వసూలు చేసి డీఎల్‌పీవో, జిల్లా పంచాయతీ అధికారి, కార్యా లయ సిబ్బందికి చెల్లిస్తారు. ఇదంతా ఆయా పంచాయతీ కార్యదర్శుల సిఫారసు మేరకే జరు గుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌ మం డల పరిధిలోని ఒక పంచాయతీలో కార్యాలయ సిబ్బంది నుంచి రూ.1000, మిగిలిన పారిశుధ్య, తదితర సిబ్బంది వద్ద నుంచి రూ.3వేల వరకు సదరు కార్మిక నాయకులు వసూలు చేసినట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా 300 పంచా య తీల్లో సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారు. సరాసరిన ఒక్కొక్కరి నుంచి రూ.1500 వసూలు చేసినట్టు లెక్కవేసినా రూ.1.50 కోట్లు అక్రమ వసూళ్లు సాగినట్టే. పోస్టు శాంక్షన్‌ వ్యవహారంలో సొమ్ములు వసూళ్లపై జిల్లా పంచా యతీ కార్యా లయం అధికారులను వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెబుతున్నారు. డీపీవో ఫోన్‌ లోనూ అందుబాటులోకి రావడంలేదు.జిల్లాలోని 300 పంచాయతీల్లో ఎంత మంది పంచాయతీ కార్మికుల జీతాలకు సంబంధించి పోస్టుశాంక్షన్‌ ఆర్డ్డర్లు ఇచ్చారన్న దానిపై మాటదాటవేస్తు న్నారు. జిల్లా పంచాయతీ అధికారులు, మండల పరిషత్‌ అధికారులు సిబ్బంది లెక్క తేల్చకపోవ డంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవసరాలను బట్టి పంచాయతీలలో సిబ్బంది నియామకాలు చేపట్టవచ్చుగాని వారిని ఏ స్థాన ంలో నియమించారో ఆ స్థానంలో పనిచేయి ం చాలి. ఎలాంటి క్వాలిఫికేషన్‌ లేకుండా, అర్హతతో సంబంధంలేకుండా పోస్టులను సృష్టిం చి అర్హత లేకపోయినా నియామకాలు చేపట్టారు. కొంత మంది అధికారులైతే సిబ్బందిని వ్యక్తిగత అవస రాలకు (డ్రైవర్లు)గా వాడుకుంటూ పంచా యతీ నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు చెల్లించిన సంఘటనలు ఉన్నట్టు సమాచారం. దీనిపై సమ గ్ర విచారణ చేపట్టాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.పంచాయతీ సిబ్బంది నివేదికలు బయటపెడితే పంచాయతీ అధికారుల అవక తవకలు బయటపడతాయని పలువురు మాజీ ప్రజాప్రతినిధులుబహిరంగంగానే చెబుతున్నారు

ఇష్టానుసారం ఇచ్చేసినా నివేదికల్లేవ్‌!

గత ప్రభుత్వంలో పంచాయతీల్లో అక్రమ నియామకాలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. పంచాయతీల్లో ‘‘ఇష్టానుసారం ఇచ్చేశారు’’ శీర్షికన ఈ నెల 8వ తేదీన ‘‘ఆంధ్రజ్యోతి’’లో కథనం ప్రచురితమైంది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నివేదిక పంపాలంటూ జిల్లా అధికారులను కోరారు. దీంతో జిల్లాలో ఉన్న పంచాయతీ సిబ్బంది సమాచారాన్ని సేకరిస్తున్నా రు. డీపీవో ఆదేశాల మేరకు సిబ్బంది పేరు, హోదా,విధుల్లో ఎప్పుడు చేరాడు, డీపీవో జారీ చేసిన జాయినింగ్‌ ఆర్డరు (పోస్ట్‌ శాం క్షన్‌ ఆర్డర్‌) ఉందా,ఎంత జీతం తీసుకుం టున్నాడు, సీఎఫ్‌ ఎంఎస్‌ ఐడీ, ఫోన్‌ నం బరు తదితర అంశాలతో కూడిన సమా చారాన్ని పంచాయతీ కార్యదర్శుల నుంచి ఈవోపీఆర్డీ సేకరిస్తున్నారు. గత 10 రోజు లుగా వివరాలు సేకరిస్తున్నాం అంటున్నారే తప్ప నివేదికను బయటకు ఇవ్వడం లేదు. పంచాయతీల నుంచి నివేదికలు తీసు కు న్నామని ఈ నివేదిక బయటకు ఇవ్వడానికి వీల్లేదని నేరుగా జిల్లా కలెక్టరుకు సమర్పిం చామని రూరల్‌ మండల పంచాయతీ విస్తర్ణాధికారి ఆర్మ్‌స్ట్రాంగ్‌ చెబుతున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:11 AM