అనపర్తిలో అదేపట్టు!
ABN, Publish Date - Mar 30 , 2024 | 12:02 AM
అనపర్తిలో అసమ్మతి సెగలు చల్లారలేదు. తొలిజాబితాలో టీడీపీ జనసేన అనపర్తి నియో జకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రక టించి ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి అనపర్తి సీటును కేటాయిం చడం పట్ల టీడీపీ కార్యకర్తల్లో అసహనం రోజు రోజుకు పెరు గుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం నల్ల మిల్లి రామకృష్ణారెడ్డితో ఫోన్‌లో మాట్లాడినా ఆందోళన సద్దుమణ గలేదు.ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఐదుగురు సీనియర్ నాయకుల బృందం గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, సుజయ్ కృష్ణ రంగారావు, గన్ని కృష్ణలను రామవరం గ్రామంలోని నల్లమిల్లి నివాసానికి శుక్రవారం పంపారు.
మహేంద్రవాడలో ప్రజాభిప్రాయ సేకరణ
ఐదు రోజుల పాటు కుటుంబంతో పర్యటన
కలిసిన ఐదుగురు బృందం సభ్యులు
అధినేతను కలవాలన్న విన్నపం తిరస్కరణ
న్యాయం చేయాలని డిమాండ్
అనపర్తి, మార్చి 29 : అనపర్తిలో అసమ్మతి సెగలు చల్లారలేదు. తొలిజాబితాలో టీడీపీ జనసేన అనపర్తి నియో జకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రక టించి ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి అనపర్తి సీటును కేటాయిం చడం పట్ల టీడీపీ కార్యకర్తల్లో అసహనం రోజు రోజుకు పెరు గుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం నల్ల మిల్లి రామకృష్ణారెడ్డితో ఫోన్‌లో మాట్లాడినా ఆందోళన సద్దుమణ గలేదు.ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఐదుగురు సీనియర్ నాయకుల బృందం గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, సుజయ్ కృష్ణ రంగారావు, గన్ని కృష్ణలను రామవరం గ్రామంలోని నల్లమిల్లి నివాసానికి శుక్రవారం పంపారు. నల్లమిల్లి మూలారెడ్డి సతీమణి రామకృష్ణారెడ్డి మాతృమూర్తి సత్యవతి మాట్లా డుతూ మూలారెడ్డి అనారోగ్యంతో ఉన్నపుడు పరామర్శకు వచ్చిన చంద్రబాబు మీ కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చారని.. ఇప్పుడు తమ కుటుంబానికి చేసిందేమిటని ప్రశ్నించారు. 42 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేసిన తమ కుటుంబానికి ఇలా చేయడం సమంజసమా అన్నారు. దీనిపై బృందం నాయకులు మౌనం వహించారు. అనంతరం నల్ల మిల్లితో మాట్లాడుతూ విజయవాడ వచ్చి అధినేత చంద్ర బాబుతో మాట్లాడాలని సూచించారు. అయితే తాను ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ఐదు రోజుల పాటు కుటుంబంతో కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తానని మాటి చ్చానని తాను ప్రస్తుతం కలవలేనని వారి ప్రతిపాద నను సున్నితంగా తిరస్కరించారు. అనంతరం నల్లమిల్లి ఇంటి నుంచి బయటకు వస్తున్న నాయకుల బృందాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. తమ నాయకుడు చేసిన తప్పేమిటో తేల్చి చెప్పాలని బైఠాయించారు. నియోజకవర్గంలో ఎన్‌డీఏ అభ్యర్థిగా బలంలేని వ్యక్తిని నిలపడం ద్వారా ఇటు అనపర్తి అసెంబ్లీ సీటు, రాజమండ్రి పార్లమెంట్ సీటు ఓడిపోయే ప్రమాదం ఉందని అధినేతలకు తెలియదా అంటూ ప్రశ్నిం చారు. కార్యకర్తలనుద్దేశించి బృందంలోని బుచ్చయ్య చౌదరి, సుజయ కృష్ణ రంగారావు కార్యకర్తలను వారించే ప్రయత్నం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ బలహీనపడితే వచ్చే నష్టాలు తమకు తెలుసునని దీనిని అధినేత దృష్టికి తీసుకు వెళ్లామని.. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు.ఒకటి రెండు రోజుల్లో మంచి ప్రకటన వస్తుం దన్న నమ్మకంతో తామంతా ఉన్నామన్నారు.
మహేంద్రవాడలో ప్రజాభిప్రాయ సేకరణ
అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని లేకుండా చేయాలని కొంత మంది పన్నిన కుట్ర లో మూడు పార్టీల నేతలు తిప్పికొట్టాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి సీటు ఇవ్వకపోవడంపై శుక్రవారం తన మాతృమూర్తి నల్లమిల్లి సత్యవతి, సతీమణి మహాలక్ష్మి, కుమారుడు మనోజ్‌రెడ్డి, కుమార్తె డాక్టర్ సనా తనితో కలిసి శుక్రవారం అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కుటుంబంతో సహా వారంతా ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న నల్లమిల్లి మూలా రెడ్డి సతీమణి కొద్ది దూరం నడచినప్పటికీ వయసు సహకరించకపోవడంతో ఆమెను రిక్షాలో కూర్చుండబెట్టి పర్యటించారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంచారు. మూడు పార్టీల అధినేతలు సీటు మార్పుపై పునరాలోచన చేయాలన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకే కుటుంబం అంతా పర్యటిస్తున్నామన్నారు. బిక్కవోలు మండలం పందలపాకలో శనివారం పర్యటిస్తానన్నారు.
Updated Date - Mar 30 , 2024 | 12:02 AM