ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అంతా ఓకే!

ABN, Publish Date - Mar 24 , 2024 | 01:11 AM

రాష్ట్రవ్యాప్తంగా రాజకీయపరంగా ఉత్కంఠ రేపిన పి.గన్నవరం రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. స్వ యంగా జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌కల్యాణే ఈ ప్రకటన చేశారు.

పి.గన్నవరం అభ్యర్థి గిడ్డికి ధ్రువీకరణ పత్రం అందిస్తున్న పవన్‌

కోనసీమ జిల్లా పి.గన్నవరంలో రాజకీయ ఉత్కంఠకు తెర

జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అధికారిక ప్రకటన

జోష్‌లో ఉన్న గన్నవరం నియోజకవర్గ కూటమి శ్రేణులు

ఉమ్మడి తూర్పుగోదావరిలో అన్ని సీట్లకు అభ్యర్థులు ఖరారు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా రాజకీయపరంగా ఉత్కంఠ రేపిన పి.గన్నవరం రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. స్వ యంగా జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌కల్యాణే ఈ ప్రకటన చేశారు. నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా విశ్రాంత పోలీసు అధికారి గిడ్డి సత్యనారాయణ పేరును శనివారం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలి విడత జాబితాలో పి.గన్నవరం స్థానానికి టీడీపీ అభ్యర్థిగా సరిపెల్ల రాజేష్‌ అలియాస్‌ మహాసేన రాజేష్‌ పేరును ప్రకటించారు. అయితే రాజేష్‌ అభ్యర్థిత్వం పట్ల వ్యక్తమైన అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని మార్పు అనివార్యమైంది. టీడీపీ ఖాతాలో ఉన్న ఈ సీటు వ్యూహాత్మకంగా జనసేనకు దక్కింది. టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్‌ యూట్యూబ్‌ చానల్‌లో గతంలో టీడీపీ, జనసేన, హిందూ కులాలకు వ్యతిరేకంగా చేసిన వీడియోల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ ప్రజలు, ఆయా పార్టీల కేడర్‌ వ్యతిరేకించడంతో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీకి నష్టం కలగకూడదనే సదుద్దేశంతో మహాసేన రాజేష్‌ స్వచ్ఛందంగా తానే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిత్వం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటన చేశారు. పార్టీ ఆదేశాలతో సంబంధం లేకుండా టీడీపీకి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్వచ్ఛంద ప్రకటన సారాంశం. అయితే తరువాత తన నిర్ణయం పట్ల పార్టీ నుంచి ఎటువంటి స్పందన వెలువడకపోవడంతో మళ్లీ పోటీ చేసేందుకు రాజేష్‌ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పి.గన్నవరం అభ్యర్థిత్వం ఆటలాడుకుందనే చెప్పాలి. ఆయా పార్టీలకు చెందినవారు ఆ నియోజకవర్గం నుంచి తాము పోటీ చేస్తామంటే తాము పోటీ చేస్తామని ప్రకటనలు ఇస్తూ నియోజకవర్గ ఓటర్లను గందరగోళంలో ముంచెత్తారు. టీడీపీ నుంచి కొందరు. బీజేపీ నుంచి టీఎస్‌ఎన్‌ మూర్తి, మానేపల్లి అయ్యాజీవేమాల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు కూడా సోషల్‌ మీడియాలో ప్రచారం హోరెత్తింది. అయితే గన్నవరం సీటు పైనే ఆశలు పెట్టుకుని పోలీసు శాఖలో చేస్తున్న ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణచేసి జనసేనలో చేరిన గిడ్డి సత్యనారాయణ పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్ని కొనసాగించడంతోచివరకు విజయం సాధించారు. టీడీపీ స్థానంలో జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ శనివారం చేసిన ప్రకటనతో ఈ నియోజకవర్గంపై అటు టీడీపీ, ఇటు బీజేపీలో నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. దాంతో జనసేన కేడర్‌లో ఆనందం పెల్లుబికుతోంది. పైగా నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న జనసేన విజేతల సమాచారాన్ని తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ ఆనందం వ్యక్తం చేయడంతోపాటు వారు పార్టీ కోసం చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని గన్నవరం స్థానం నుంచి జనసేన అభ్యర్థిని పోటీలోకి పెడుతున్నామని, మీరంతా కష్టపడి పనిచేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. మొత్తం మీద తొలి జాబితాలో టీడీపీ ప్రకటించిన స్థానాన్ని జిల్లాలో చిట్టచివరి స్థానంగా జనసేన అభ్యర్థిత్వాన్ని ఖరా రు చేసింది. ఈ క్రమంలో అభ్యర్థుల బలాబలాలపై తాజా చర్చ మొదలైంది.

పి.గన్నవరాన్ని పవన్‌కల్యాణ్‌కు గిఫ్ట్‌గా అందిస్తా

- జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణల

టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సహకారంతో పి.గన్నవరం నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి జన సేనాని పవన్‌కల్యాణ్‌ గిఫ్ట్‌గా అందిస్తా. నామీద నమ్మకంతో సీటు కేటాయించిన పవన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. జనసేన అధినేత ఆశయాలతో నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి నిరుపేదకు అండగా నిలుస్తాను. నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపిస్తాను.

అభ్యర్థి వివరాలివీ..

గిడ్డి సత్యనారాయణ స్వగ్రామం పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు ఊడిమూడిలంక. బీఏ, బీఎల్‌ చదువుకున్న ఆయన హైదరాబాదు సిటీ కమిషనర్‌ కార్యాలయంలో 20 ఏళ్లుగా అక్కౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేసి ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. విద్యార్థి దశలోనే రాజకీయపరంగా 1989లో తెలుగు యువత జిల్లా కన్వీనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల జనసేనలో చేరిన ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలంగా నియోజకవర్గంలో పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు.

రాష్ట్రంలో పొత్తుకు నాంది మీ నియోజకవర్గమే..

సత్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించండి : పవన్‌ పిలుపు

పి.గన్నవరం, మార్చి 23: రాష్ట్రంలో పొత్తుకు నాంది పలికింది మీ నియోజకవర్గమేనని మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో శనివారం జరిగిన సమావేశంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలతో టీడీపీ, జనసేన పొత్తు ఏర్పాటుచేసుకుని అనుసరించి న తీరు అభినందనీయమన్నారని పవన్‌ అన్నారు. అత్యధిక ఎంపీటీసీలు, సర్పంచ్‌లతోపాటు ఎంపీపీని గెలిపించి పొత్తుకు ఆదర్శంగా నిలిచారని, అదే నమ్మ కంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న గిడ్డి సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని పవన్‌ ప్రకటించారు. పొత్తులో భాగంగా టీడీ పీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించి తీసుకురావాలని పవన్‌కల్యాణ్‌ కోరినట్టు పార్టీ నేతలు తెలిపా రు. సమావేశంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శిరిగి నీడి వెంకటేశ్వరావు, జిల్లా కార్యదర్శులు వాసంశెట్టి కు మార్‌, మద్దా చంటిబాబు, ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, మండల అధ్యక్షులు సాధనాల శ్రీవెంకట సత్యనారా యణ, జాలెం శ్రీనివాసరాజా, దొమ్మేటి సాయికృష్ణ, పొలిశెట్టి రాజేష్‌, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 01:11 AM

Advertising
Advertising