కిక్కే కిక్కు
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:35 AM
జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు. సంక్రాంతి పండగ పేరుతో మూడురోజులు విరామం లేకుండా తెగ తాగేశారు. వేలాది మందు సీసాలు, బీరు బాటిళ్లు ఉఫ్ మని ఊదేశారు. ఎత్తిన బాటిళ్లు దించ కుండా సీసాలకు సీసాలు ఖాళీ చేసేశారు. ఒకరకంగా చెప్పాలంటే సం క్రాంతి పండగ మూడురోజులు మందుబాబులు అడ్డూఅదుపు లేకుం డా తాగడమే పనిగా పెట్టుకున్నారు.
-జిల్లాలో సంక్రాంతి పండుగకు సీసాలకు సీసాలు ఊదేసిన మందుబాబులు
-భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో ఏకంగా రూ.22.42కోట్ల మద్యం అమ్మకాలు
-ఒక్కో రోజు రూ.7కోట్లకుపైగానే సరుకు ఖాళీ: మామూలు రోజులకంటే డబుల్
-పండగ మూడు రోజులకు కలిపి ఏకంగా 2.65 లక్షల బీరు సీసాలు లేపేసిన వైనం
-గతేడాది సంక్రాంతికి జిల్లావ్యాప్తంగా రూ.20కోట్ల మద్యం అమ్మకాలు
-అప్పటితో పోల్చితే ఈసారి రూ.2.42కోట్లకుపైగా అదనపు విక్రయాలు
-మొన్న డిసెంబర్ 31న జిల్లా అంతా కలిపి రూ.7.50కోట్లకుపైగా మందు అమ్మకం
-ఈనెలలో మొత్తం మద్యం విక్రయాలు రూ.100కోట్లు దాటొచ్చని అంచనా
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు. సంక్రాంతి పండగ పేరుతో మూడురోజులు విరామం లేకుండా తెగ తాగేశారు. వేలాది మందు సీసాలు, బీరు బాటిళ్లు ఉఫ్ మని ఊదేశారు. ఎత్తిన బాటిళ్లు దించ కుండా సీసాలకు సీసాలు ఖాళీ చేసేశారు. ఒకరకంగా చెప్పాలంటే సం క్రాంతి పండగ మూడురోజులు మందుబాబులు అడ్డూఅదుపు లేకుం డా తాగడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు సృష్టించాయి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు జిల్లావ్యాప్తంగా మద్యం విక్రయాలు ఏకంగా రూ.22.42కోట్లకు చేరాయి. దీంతో ఎక్సైజ్‌శాఖకు కాసుల పంట పండింది. తెచ్చిన స్టాకు మూడురోజుల్లోనే ఖాళీ అయిపోవడంతో కోట్లతో ఖజానా నిండిపోయిం ది. అసలే ఎన్నికల ఏడాది కావడంతో ఈ సంక్రాంతికి మందు విక్ర యాలు భారీగా ఉంటాయని ఎక్సైజ్‌శాఖ ముందుగానే సిద్ధమై గోదా ములను సరుకుతో నింపేసింది. జిల్లాలో ఎక్కడికక్కడ మద్యం దుకా ణాలకు స్టాకు భారీగా పంపింది. అనుకున్నట్లుగానే కనుమ మరుసటి రోజుకు మద్యం దుకాణాల్లో సరుకు అంతా ఖాళీ అయిపోయింది. గతేడాది సంక్రాంతికి జిల్లావ్యాప్తంగా రూ.20కోట్ల సరుకు అమ్ముడవగా, ఈఏడాది మరో రూ.2.42కోట్ల వరకు అదనంగా అమ్మకాలు జరిగాయి.
ఊదేశారంతే...
సంక్రాంతి అంటే కోడిపందేలు. కోడి పందేలు అంటే సంక్రాంతి. వివిధ వృత్తులు, ఉపాధి రిత్యా దేశ నలమూలలా ఎవరు ఎక్కడెక్కడ ఉన్నా పెద్దపండగకు సొంతూర్లకు వచ్చి వాలాల్సిందే. మూడురోజుల పాటు సరదా.. సరదాగా గడిపేయాల్సిందే. ఈ క్రమంలో సంక్రాంతి పండగ పేరుతో స్నేహితులు కలిస్తే ఊరుకుంటారా.. ఏకంగా మందు సీసాలు పదుల సంఖ్యలో ఖాళీ అవ్వాల్సిందే. ఇదేకాదు జిల్లాలో సం క్రాంతికి కోడిపందాలు ఎక్కడికక్కడ గ్రామాలు, పట్టణాలు, కాకినాడ నగరం ఇలా ప్రతిచోటా నిర్వహించారు. అదే చోట కోట్లలో గుండాటలు కూడా నిర్వహించారు. దీంతో ఒకపక్క కోడిపందాలు, గుండాట ఎంజా య్ చేస్తూ మరోపక్క మద్యం సీసాలను మందుబాబులు తెగ తాగే శారు. భోగి, సంక్రాంతి, కనుమ పండగల పేరుతో మూడురోజులపా టు బాటి ళ్లకు బాటిళ్లు ఎత్తేశారు. వాస్తవానికి ఈ సంక్రాంతి ఎన్నికల ఏడాది కావడంతో జిల్లావ్యాప్తంగా కోడి పందేలకు ఆటంకాలు లేకుండా ఎక్కడికక్కడ అధికారపార్టీ నేతలు చూసుకున్నారు. ఫలితంగా ప్రతి చోటా పందాలు భారీగా జరిగాయి. అదే సమయంలో మందు విక్ర యాలు సైతం బరుల సమీపంలో దర్జాగా జరిగాయి. ఫలితంగా ఈ దఫా సంక్రాంతికి పండగకు జిల్లాలో మద్యం అమ్మకాలు మూడు రోజు లకు కలిపి ఏకంగా రూ.22.42కోట్లకు ఎగబాకాయి. ఒకరకంగా చెప్పా లంటే జిల్లాల విభజన తర్వాత సంక్రాంతి పండగకు ఈస్థాయిలో అ మ్మకాలు జరగడం ఇదే తొలిసారి. గతేడాది జిల్లాలో సంక్రాంతికి రూ.20కోట్ల వరకు మద్యం అమ్ముడై కొత్త రికార్డు సృష్టించింది. కానీ ఈ ఏడాది అమ్మకాలు అంతకుమించి జరగడంతో గతేడాది రికార్డు బద్దలైంది. జిల్లాలో ఒక్క భోగి రోజు విక్రయాలే రూ.7.78కోట్లు నమోద య్యాయి. సంక్రాంతి రోజు రూ.7.51కోట్లు, కనుమ రోజు రూ.7.13కోట్లు చొప్పున మద్యం అమ్ముడైంది. మొత్తం మద్యం విక్రయాలు జిల్లాలో మూడురోజులకు కలిపి రూ.22.42 కోట్లుగా నమోదైంది. ఇందులో బ్రాందీ, విస్కీ, రమ్ము తదితర ఐఎంఎల్ మద్యం కేసులు 22,562 అమ్ముడవగా, బీరుసీసాలు 2.65లక్షలు విక్రయాలుజరిగాయి. వాస్తవానికి జిల్లా లో సాధారణ రోజుల్లో రోజుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 157 మద్యం దుకాణా ల్లో రూ.3కోట్లవరకు మద్యం విక్రయా లు జరుగుతుంటాయి. కానీ సం క్రాంతి పండగ నేపథ్యంలో రోజువారీ అమ్మ కాలు రూ.7కోట్లు దాటిపోయాయి. అం టే డబుల్ విక్రయాలు జరిగాయన్న మాట. ఈ సంక్రాంతి ఎన్నికల ఏడాది కావడంతో మందు విక్రయాలు భారీగా ఉంటాయని అధికారులు ముందుగానే అంచనా వేసి అన్ని మద్యం దుకాణాల కు డబుల్ ఇండెంట్ పంపారు. అనుకున్నట్లుగానే సరుకంతా మందు బాబులు ఊదేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు కోట్ల కళ పెరి గింది. గతనెల డిసెంబరు 31న జిల్లాలో రూ.7.50కోట్ల వరకు న్యూ ఇయర్ పేరుతో మద్యం విక్రయాలు జరిగాయి. అంతకుముందు ఏడా దితో పోల్చితే ఈ విక్రయాలు ఎక్కువే. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు మద్యం ఆదాయం భారీగా వచ్చి పడింది. ఈనెలలో సంక్రాంతి అమ్మ కాలు అధికంగా ఉన్న నేపథ్యంలో జనవరి మద్యం అమ్మకాలు రూ.100 కోట్ల వరకు దాటవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో గతేడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబరు 31వరకు జిల్లావ్యాప్తంగా రూ.855కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జనవరి విక్రయాలు తోడైతే ఏకంగా రూ.వెయ్యి కోట్ల అమ్మకాలు దాటవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Updated Date - Jan 18 , 2024 | 12:35 AM