కొల్లేరు ఆక్రమణలతోనే బుడమేరుకు వరద
ABN, Publish Date - Oct 27 , 2024 | 03:29 AM
కొల్లేరు ఆక్రమణలతోనే బుడమేరు వరద సమస్య తలెత్తిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
న్యూఢిల్లీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కొల్లేరు ఆక్రమణలతోనే బుడమేరు వరద సమస్య తలెత్తిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొల్లేరు ఆక్రమణపై గతంలో తాము పోరాటాలు చేశామని, సమస్యను అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. అప్పట్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్‌ను మాఫియా టార్గెట్ చేసిందని చెప్పారు. కొల్లేరు ఆక్రమణలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించాలని నారాయణ కోరారు. ఆక్రమణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, రాష్ట ప్రభుత్వానికి జారీచేసిన కోర్టు ధిక్కరణ నోటీసులను సీరియ్‌సగా పరిగణించాలన్నారు. కొల్లేరును పరిరక్షించడం వల్ల ఏపీకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. కొల్లేరు సరస్సును పరిరక్షించాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు తాను లేఖ రాశానని తెలిపారు.
Updated Date - Oct 27 , 2024 | 03:29 AM