ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రంలో చలి మొదలు

ABN, Publish Date - Oct 27 , 2024 | 04:02 AM

శీతాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ చలి మొదలైంది. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.

విశాఖపట్నం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): శీతాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ చలి మొదలైంది. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అదే సమయంలో పగటిపూట ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. కావలిలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, ఆరోగ్యవరంలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. వాయవ్య భారతం నుంచి వీస్తున్న గాలులతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని పలుచోట్ల వర్షాలు కురిసినట్టు పేర్కొన్నారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని తెలిపారు.

Updated Date - Oct 27 , 2024 | 04:02 AM