ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Elections 2024: పలమనేరు వైసీపీ అభ్యర్థి ఎవరు..?

ABN, First Publish Date - 2024-02-10T01:00:03+05:30

పలమనేరులో ఈసారి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదనే చెప్పాలి. వైసీపీ విడుదల చేసిన 7 జాబితాల్లోనూ వెంకటేగౌడ పేరు లేకపోవడం, ఈ మధ్య పలువురి పేర్లు ప్రచారంలోకి రావడంతో ఇక్కడ సందిగ్ధం నెలకొంది. ఇదిలా ఉండగా, మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరు నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో టీడీపీలోకి చేరుతున్నారు. వెంకటేగౌడ మీద ఆరోపణలు, సర్వేలో వ్యతిరేకత రావడంతో అమరనాథరెడ్డికి దీటైన అభ్యర్థి కోసం వైసీపీ అధిష్ఠానం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

విలేకరులతో మాట్లాడుతున్న వెంకటేగౌడ

  • తెరపైకి కొత్త పేర్లు

  • ధీమాగా వెంకటేగౌడ

  • అమరనాథరెడ్డికి దీటైన అభ్యర్థి కోసం వైసీపీ గాలింపు

పలమనేరు, ఫిబ్రవరి 8: పలమనేరులో ఈసారి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదనే చెప్పాలి. వైసీపీ విడుదల చేసిన 7 జాబితాల్లోనూ వెంకటేగౌడ పేరు లేకపోవడం, ఈ మధ్య పలువురి పేర్లు ప్రచారంలోకి రావడంతో ఇక్కడ సందిగ్ధం నెలకొంది. ఇదిలా ఉండగా, మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరు నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో టీడీపీలోకి చేరుతున్నారు. వెంకటేగౌడ మీద ఆరోపణలు, సర్వేలో వ్యతిరేకత రావడంతో అమరనాథరెడ్డికి దీటైన అభ్యర్థి కోసం వైసీపీ అధిష్ఠానం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేపై ఆరోపణలెన్నో?

ఏమాత్రం రాజకీయ నేపథ్యంలేని వెంకటేగౌడ 2019 ఎన్నికల్లో పలమనేరు వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. గెలిచిన ఏడాదిన్నరకే నియోజకవర్గంలోని పలువురు సీనియర్‌ నాయకుల పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపించారు. దీంతో వాళ్లంతా అంటీముట్టనట్లు ఉండిపోయారు. నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులను అప్పగించడంలోనూ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. శంకర్రాయలపేట చెరువు నుంచి కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలించారని, గొల్లపల్లె సమీపంలో చెల్లని చెక్కుతో క్వారీ కొనుగోలు చేశారని, బలవంతంగా కొందరి క్వారీలను లాక్కున్నారని ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలున్నాయి. చెల్లని చెక్కు వ్యవహారం ఇప్పటికే కర్ణాటక కేజీఎఫ్‌ కోర్టులో నడుస్తోంది. పలమనేరు సమీప గంటావూరు ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అండతోనే పేదల ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి. అలాంటి వారికి వెంకటేగౌడ రాజకీయ పదవులు కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది.

వెంకటేగౌడకు టికెట్‌ ఇస్తే పనిచేయం

ఈసారి వెంకటేగౌడకు టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని పెద్దపంజాణి, గంగవరం మండలాల సొంతపార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. ఇక, వెంకటేగౌడ సొంత మండలమైన వి.కోటలోనూ ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం బలంగా ఉంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైసీపీకి, ఎమ్మెల్యేకి వ్యతిరేకత బలంగా ఉందనే విషయం తెలుస్తోంది. వైసీపీ చేసుకున్న సర్వేలో వెంకటేగౌడ మీద వ్యతిరేకత ఉందని సమాచారం. దీనికి తోడు నియోజకవర్గంలోని నాయకులు పెద్దిరెడ్డిని కలిసి గౌడకు టికెట్‌ ఇవ్వద్దని కోరినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ 7 జాబిత్లోనూ గౌడకు స్పష్టత ఇవ్వనట్లు ప్రచారం జరుగుతోంది.

తెరపైకి కొత్త పేర్లు..

టీడీపీ నేత సుభా్‌షచంద్రబోస్‌ ఇటీవల సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. పలమనేరు టికెట్‌ మాట తీసుకునే బోస్‌ వైసీపీలో చేరారనే ప్రచారం ఊపందుకున్నా.. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్‌ అయిపోయారు. ఈమధ్య జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు కూడా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈయనకు అధిష్ఠానం అండ ఉండడంతోనే అనూహ్యంగా జడ్పీ చైర్మన్‌ అయిన విషయం తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం అప్పట్లో జరిగినా ఇప్పుడు ఆ ప్రస్తావన లేదు. యాదమరి మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్‌రెడ్డి పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఈయన జడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనుంజయరెడ్డికి సోదరుడు. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు విషయాల్లో మోహన్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ మోహన్‌రెడ్డి పేరు పలమనేరు నుంచి ప్రచారం నుంచి వచ్చిన విషయం తెలిసిందే.

టికెట్‌ నా జేబులో ఉంది: ఎమ్మెల్యే

‘ఎప్పుడో చెప్పాను కదా.. టికెట్‌ నా జేబులో ఉందని. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు’ అంటూ పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ వ్యాఖ్యానించారు. సుమారు వారం రోజులుగా వార్తలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే.. శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో కలిసి పలమనేరులో యాత్ర-2 సినిమా చూశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనతో.. పలమనేరు టికెట్‌ ఎవరికో వస్తుందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోందన్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. టికెట్‌ తన జేబులో ఉందని పేర్కొన్నారు. మరి, జేబులో టికెట్‌ ఉన్నా.. వైసీపీ అధిష్ఠానం ఏడుసార్లు ప్రకటించిన జాబితాల్లో వెంకటేగౌడ పేరు ఎందుకు లేదబ్బా అంటూ స్థానికంగా చర్చ సాగుతోంది.

Updated Date - 2024-02-10T07:08:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising