ఎస్‌ఈబీలో పలువురి బదిలీ
ABN, Publish Date - Jan 21 , 2024 | 01:44 AM
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)లో పలువురు సీఐలు, ఎస్‌ఐలు బదిలీ అయ్యారు.
తిరుపతి(నేరవిభాగం), జనవరి 20: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)లో పలువురు సీఐలు, ఎస్‌ఐలు బదిలీ అయ్యారు.తిరుపతి రూరల్ సీఐ కేవీఎస్ ఫణీంద్ర తాడిపత్రికి, చంద్రగిరి సీఐ లీలారాణి కడప జిల్లా ఎర్రగుంట్లకు బదిలీ అయ్యారు. పుత్తూరు సీఐ ఎస్. కృష్ణ అనంతపురం బదిలీ కాగా శ్రీకాళహస్తి సీఐ వెంకట పవన్‌కుమార్ రాజంపేటకు, తిరుమల సీఐ తిరుమలయ్య కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు. తిరుపతి ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డిని పెనుగొండకు,తిరుపతి అర్బన్ సీఐ సి. నాగరాజరెడ్డిని జిల్లా టాస్క్‌ఫోర్స్ విభాగానికి ,అక్కడ పనిచేస్తున్న సీఐ హేమంత్‌కుమార్‌ను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేశారు.గుంటూరు-1 ఎస్‌ఈబీ సీఐగా పనిచేస్తున్న ఎం. రమేష్ గూడూరుకు రానుండగా, చీరాల సీఐ కె. సోమయ్య సూళ్లూరుపేటకు, గిద్దలూరు సీఐ ఇ.అరుణకుమారి నాయుడుపేటకు,క్రోసూరు సీఐ కె. వినయ్‌కుమార్ వెంకటగిరికి బదిలీపై రానున్నారు.
ఎస్‌ఐల బదిలీ
తిరుపతి అర్బన్ ఎస్‌ఐ కె. సుబ్రమణ్యం కడప జిల్లా ఎర్రగుంట్లకు, తిరుపతి రూరల్ ఎస్‌ఐ ఎ.భాస్కర్ అన్నమయ్య జిల్లా కోడూరుకు, చంద్రగిరి ఎస్‌ఐ బి. చైతన్య చిత్తూరు జిల్లా పులిచెర్లకు, పుత్తూరు ఎస్‌ఐ ఎ. నాగరాజు కార్వేటి నగరానికి బదిలీ అయ్యారు. శ్రీకాళహస్తి ఎస్‌ఐ బి. మోహన్‌కృష్ణ నంద్యాల జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు, తిరుమల ఎస్‌ఐ ఎం. రమణ కడప జిల్లా ఎస్‌ఈబీ ఇంటెలిజెన్స్‌కు, తిరుపతి జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ పీవీ నరసింహులు నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు బదిలీ అయ్యారు. తిరుపతి ఇంటెలిజెన్స్ ఎస్‌ఐ ఎం. మురళి రాయచోటికి , గూడూరు డివిజన్ బీవీ పాళెం చెక్‌పోస్టులో పనిచేస్తున్న ఎస్‌ఐ ఎస్. మోజెస్ గూడూరుకు బదిలీ అయ్యారు.జిల్లాయేతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏడుగురు ఎస్‌ఐలు బదిలీపై గూడూరు డివిజన్‌కు రానున్నారు. మాచెర్ల ఎస్‌ఐ ఎం. జయరావు వాకాడుకు, పొండుగుల చెక్‌పోస్టు ఎస్‌ఐలు సోమ ఆంజనేయులు సూళ్లూరుపేటకు, పి. మహబూబ్‌వలి వెంకటగిరికి, ఒంగోలు ఇంటెలిజెన్స్ విభాగం ఎస్‌ఐ ఎస్. మునీర్ అహ్మద్ నాయుడుపేటకు నెల్లూరు జిల్లా కోవూరు ఎస్‌ఐ తలుపుల శ్రీనివాసులు, బుచ్చిరెడ్డిపాళెం ఎస్‌ఐ ఎం. అంజయ్య, కావలి ఎస్‌ఐ డి. శ్రీధర్ బీవీ పాళెం చెక్‌పోస్టుకు బదిలీ అయ్యారు.
చిత్తూరులో సీఐల బదిలీలిలా..
చిత్తూరు సిటీ, జనవరి 20: ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ శాఖల్లో అధికారుల బదిలీలు జోరందుకున్నాయి. శనివారం ఎక్సైజ్ శాఖకు సంబంధించి వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) సీఐలను ప్రభుత్వం బదిలీ చేసింది. చిత్తూరు అర్బన్ సీఐ జోగేంద్ర.. నంద్యాల జిల్లా బనగానపల్లెకు, చిత్తూరు రూరల్ సీఐ చంద్రశేఖర్.. కర్నూలు జిల్లా క్షేత్రగుడికి, రామసముద్రం సీఐ శ్వేతారెడ్డి.. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకు, కార్వేటినరగం నాగరాజు.. కడప జిల్లా సిద్దవటంకు, నగరి సీఐ వర్దనాదేవి.. నంద్యాల జిల్లా కోయిలకుంట్లకు, పలమనేరు సీఐ ఎల్లయ్య.. అనంతపురానికి, కుప్పం సీఐ కిషోర్ కుమార్.. అనంతపురం జిల్లా ఉరవకొండకు, పుంగనూరు సీఐ శ్వేతారామి రెడ్డి.. నంద్యాల జిల్లా నందికొట్కూరుకు, వి.కోట సీఐ కన్నయ్య.. పుట్టపర్తికి, నరహరిపేట చెక్‌పోస్టు సీఐ రఫి.. కర్నూలు ఇంటెలిజెన్స్‌కు, పలమనేరు క్యాటిల్ ఫామ్ చెక్‌పోస్ట్ సీఐ మహ్మద్ రఫీ.. కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు.
Updated Date - Jan 21 , 2024 | 01:44 AM