నేలపట్టులో సందర్శకుల సందడి
ABN, Publish Date - Nov 25 , 2024 | 02:04 AM
నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం సందర్శకులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో పక్షుల కేంద్రంలోని విడిదిలో ఉన్న విహంగాలను చూసేందుకు తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి సందర్శకులు విచ్చేశారు.
దొరవారిసత్రం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం సందర్శకులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో పక్షుల కేంద్రంలోని విడిదిలో ఉన్న విహంగాలను చూసేందుకు తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి సందర్శకులు విచ్చేశారు. శ్రీసిటీ, మాంబట్టు సెజ్‌ల్లో పనిచేసే ఉద్యోగులు కూడ నేలపట్టుకు వచ్చారు. చెరువుల కట్టలపైన ఉన్న వాచ్ టవర్స్.. సందర్శన ప్రాంతాల నుంచి పక్షులను వీక్షించారు. వన్యప్రాణి సంరక్షణ శాఖ ఏర్పాటు చేసిన బైనాక్యులర్ల ద్వారా దూరంలో ఉండే పక్షులనూ వీక్షించారు. స్థానిక టూరిజం గైడ్ హుస్సేన్ పక్షుల ప్రాముఖ్యత, వాటి జీవన విధానాల గురించి సందర్శకులకు తెలియజేశారు. ఈ పక్షుల కేంద్రాన్ని జర్మనీ దేశీస్తులు సందర్శించారు. శ్రీసిటీలోని ఓ కంపెనీలో పనిచేసే కుటుంబం తమ తల్లితో కలసి పక్షులను వీక్షించారు. ఇటువంటి పక్షుల కేంద్రం అరుదుగా ఉంటుందని వారు అభిప్రాయ పడ్డారు.
Updated Date - Nov 25 , 2024 | 02:04 AM