శనీశ్వర స్వామికి విశేష పూజలు
ABN, Publish Date - Jan 20 , 2024 | 11:35 PM
శ్రీకాళహస్తీశ్వ రాలయంలోని శనీశ్వర స్వామికి విశేష పూజలు జరిగాయి.
శ్రీకాళహస్తి జనవరి 20: శ్రీకాళహస్తీశ్వ రాలయంలోని శనీశ్వర స్వామికి విశేష పూజలు జరిగాయి. శనివారం పురస్కరిం చుకుని ముందుగా అర్చకులు శనీశ్వర స్వామి సన్నిధిని శుద్ధి చేశారు. అనంతరం సంకల్పం పూజలు చేశారు. వివిధ పూజా ద్రవ్యాలతో పాటు శని ప్రీతి కోసం విశే షంగా తైలాభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి విశేషాలంకారంతో దర్శన భాగ్యం కల్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Updated Date - Jan 20 , 2024 | 11:35 PM