ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎస్పీ జాషువాపై ఈసీ బదిలీ వేటు

ABN, Publish Date - Apr 03 , 2024 | 01:43 AM

చిత్తూరు ఎస్పీ జాషువాపై మంగళవారం ఈసీ బదిలీ వేటు వేసింది.

చిత్తూరు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు ఎస్పీ జాషువాపై మంగళవారం ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల్లో చేరిన రెండు నెలలకే అవమానకరమైన రీతిలో బదిలీకి గురి కావడంతో పాటు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఎన్నికలకు సంబంధించిన విధులు, బాధ్యతలు అప్పగించవద్దని ఈసీ ఆదేశించడం గమనార్హం. ‘మనం ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నాం. ఏ పార్టీకీ అనుకూలంగా ఉండొద్దు. నిక్కచ్చిగా వ్యవహరించండి’ అంటూ నిత్యం పోలీసు అధికారుల సమావేశాల్లో, టెలీ కాన్ఫరెన్సుల్లో చెప్పే ఎస్పీ జాషువా.. లోపల మాత్రం వైసీపీకి అనుకూలంగా చేయాల్సిందంతా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆయన్ను బదిలీపై జిల్లాకు పంపినట్లు తెలుస్తోంది. గతంలో విజయవాడ శాంతిభద్రతల డీసీపీ, కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. వైసీపీకి విధేయుడనే ముద్ర వేసుకోవడంతోనే జిల్లాకు వచ్చారనే ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరేలా ఆయన జిల్లాకు వచ్చిన వెంటనే తన టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు కొన్ని రోజుల ముందే జిల్లాలో అటాచ్‌మెంట్‌లో ఉన్న సుమారు 200 మంది సిబ్బందిని పూర్వ స్థానాలకు బదిలీ చేశారు. దీంతో పాటు కీలకమైన స్పెషల్‌ బ్రాంచి విభాగంలోనూ 14 మందితో టీమ్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇలా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఎస్‌ఐ, సీఐలను క్షేత్రస్థాయిలో సిద్ధంచేసినట్లు ప్రచారంలో ఉంది. ఆయన వచ్చాక 400 మందికిపైగా టీడీపీ శ్రేణుల్ని బైండోవర్‌ చేసినట్లు సమాచారం. ఇలా జిల్లాలో వైసీపీ విజయానికి అవసరమైన ప్లాన్‌ అమలులో భాగస్వామ్యం అయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. అందులో ఎస్పీ జాషువా కూడా ఉన్నారు. దీనిపై విచారించి తగిన ఆధారాలను సేకరించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు చిత్తూరు ఎస్పీని కూడా బదిలీ చేసి, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. ఫిబ్రవరి 4న బాధ్యతలు స్వీరించిన జాషువా.. ఏప్రిల్‌ 2న బదిలీ వేటుకు గురయ్యారు. అడ్మిన్‌ ఏఎస్పీ అరీఫుల్లా ఇన్‌ఛార్జి ఎస్పీగా వ్యవహరించనున్నారు. నేడో రేపో కొత్త ఎస్పీని నియమించే అవకాశముంది.

Updated Date - Apr 03 , 2024 | 01:44 AM

Advertising
Advertising