బాధ్యతలు స్వీకరించిన సెబ్ ఏఎస్పీ సుబ్బరాజు
ABN, First Publish Date - 2024-02-06T00:33:53+05:30
సెబ్ ఏఎస్పీగా సుబ్బరాజు సోమవారం మిట్టూరులోని ఎక్సైజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
చిత్తూరు, ఫిబ్రవరి 5: సెబ్ ఏఎస్పీగా సుబ్బరాజు సోమవారం మిట్టూరులోని ఎక్సైజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1989వ బ్యాచ్‌లో ఎస్‌ఐగా పోలీసుశాఖలో చేరి పలుచోట్ల పనిచేసిన అనంతరం 2001లో సీఐగా పదోన్నతి పొంది శ్రీకాకుళం జిల్లాలో ఏడేళ్లు పనిచేశారు. 2010లో డీఎస్పీగా విజయనగరం, సీఐడీ, ఎస్‌బీ, ఇంటెలిజెన్స్, విశాఖపట్నంలో ఏసీబీ, పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో విధులు నిర్వహించారు. 2020లో ఏఎస్పీగా పదోన్నతి పొంది ఏలూరు జిల్లా ఏఎస్పీగా, భీమవరంలో పనిచేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా ఏఎస్పీగా బదిలీపై వచ్చారు. ఆయనకు శాఖ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలందించి స్వాగతం పలికారు.
Updated Date - 2024-02-06T00:33:54+05:30 IST