ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముక్కంటి ఆలయ ఆదాయానికి గండి

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:22 PM

శ్రీకాళహస్తీశ్వరాలయ దేవస్థానంలో పని చేస్తున్న కొందరు యధేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు.కొందరైతే ఇంటి అద్దెను సైతం మిగలబెట్టుకునే కక్కుర్తి బుద్ధితో వ్యవహరిస్తున్నారు.

జ్ఞాన ప్రసూనాంబికా సదన్‌

జీపీఎస్‌ అతిథి గృహంలోనే కాపురం పెట్టిన అధికారి

శ్రీకాళహస్తి, జనవరి 18: శ్రీకాళహస్తీశ్వరాలయ దేవస్థానంలో పని చేస్తున్న కొందరు యధేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు.కొందరైతే ఇంటి అద్దెను సైతం మిగలబెట్టుకునే కక్కుర్తి బుద్ధితో వ్యవహరిస్తున్నారు. ముక్కంటి సన్నిధిలో రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు చేయించుకు నేందుకు విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు బస సౌకర్యం చాలా అవసరం. ముక్కంటి ఆలయం ద్వారా పరిమిత సంఖ్యలో భక్తుల కోసం గదులు అందుబాటులో ఉన్నాయి. ఆలయ ఆవరణలోపల వీఐపీల కోసం జ్ఞాన ప్రసూనాంబికా సదన్‌(జీపీఎస్‌) వుంది. సాధారణ భక్తుల కోసం ఉన్న త్రినేత్ర అతిథి గృహం లైబ్రరీగా మారిపోయాక జీపీఎస్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌ గదులకు రూ.1700, ఆపై అంతస్తుల్లో రూ.1000 భక్తుల నుంచి వసూలు చేస్తుంటారు. ఈ అతిధి గృహంలో గదిని పొందేం దుకు భక్తులు ఆసక్తి చూపుతుండడంతో డిమాండు బాగుంది. అంతటి విశేషమైన ఆ అతిథి గృహంలో ఓ అధికారి కాపురం పెట్టేశాడు. ఇంజనీరింగ్‌ విభా గంలో పనిచేసే ఓ కీలక అధికారి ఎనిమిది నెలల క్రితం ఈ ఆలయానికి బదిలీపై వచ్చారు. వాస్త వానికి ఆయనకు నెలకు రూ.15000 చొప్పున హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ జీతంతో పాటు పొందుతారు. అధికారి ఇంటి నుంచి విధులకు రాకపోకలు సాగించేందుకు డ్రైవర్‌తో సహా కారును కూడా ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆయన మాత్రం ఆలయ ఆవరణలోని అతిథి గృహంలోనే మకాం పెట్టారు. దీంతో రోజుకు రూ.1000 చొప్పున ఆలయ ఆదాయానికి ఎంత గండిపడిందో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల క్రితం శ్రీశైలానికి చెందిన పదిమంది ఉద్యోగులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి బదిలీపై వచ్చారు. వారిలో ఎనిమిదిమంది మూడు నెలల పాటు భక్తకన్నప్ప సదన్‌లో భక్తుల గదులను ఆవాసంగా మార్చుకున్నారు. ఆంధ్రజ్యోతిలో శివయ్యకు శఠగోపం శీర్షికన కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించి అందరినీ ఖాళీ చేయించారు. 8ఏళ్ల క్రితం అతిథి గృహంలో గదిని ఓ ఉద్యోగి కొన్ని నెలల పాటు సొంతంగా ఉపయోగించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాక అప్పటి అధికారులు ముక్కు పిండి రోజులు లెక్క కట్టి మరీ బాడుగను వసూలు చేశారని సమాచారం. ప్రస్తుతం జీపీఎస్‌లో తిష్ట వేసిన అధికారి ఏకంగా పూర్తి వంట సామగ్రిని, గ్యాస్‌, ఎలక్ర్టిక్‌ పరికరాలు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఇంటి అద్దె, ఏసీ, కరెంటు అన్నీ ఉచితం కావడంతో దర్జాగా అనుభవిస్తున్నారు. ఇదే అతిథి గృహంలో మరో కీలక అధికారి కూడా భారీగా దుర్వినియోగం చేసినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. ఇలీవల శ్రీకాళహస్తి నుంచి బదిలీ అయిన ఓ అధికారి రెండేళ్లపాటు ఇక్కడ ఇంచార్జి హోదాలో విధులు నిర్వహించారు. ఆయన ఏకంగా రెండేళ్లపాటు జీపీఎస్‌లో రెండు గదులు సొంతానికి ఉపయోగించుకున్నట్లు సమాచారం. శివయ్య సన్నిధిలో ప్రస్తుతం తిష్ట వేసిన అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Updated Date - Jan 18 , 2024 | 11:22 PM

Advertising
Advertising