ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కంగారు పుట్టించిన వెండి విరాళం

ABN, Publish Date - Nov 25 , 2024 | 02:09 AM

తిరుమల శ్రీవారికి విరాళంగా వచ్చిన వెండి పూజా సామగ్రి అధికారుల్లో కంగారు పెట్టించింది. ఈనెల 18వ తేదీన ఓ భక్తుడు 6.7 కిలోల వెండి బిందె, దీపస్తంభాలు, ప్లేట్‌ వంటి పూజా సామగ్రిని విరాళంగా ఇచ్చారు.

తిరుమల, నవంబరు24(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి విరాళంగా వచ్చిన వెండి పూజా సామగ్రి అధికారుల్లో కంగారు పెట్టించింది. ఈనెల 18వ తేదీన ఓ భక్తుడు 6.7 కిలోల వెండి బిందె, దీపస్తంభాలు, ప్లేట్‌ వంటి పూజా సామగ్రిని విరాళంగా ఇచ్చారు. ఆలయంలో అర్చకులకు అందజేసినట్టు మీడియాతో వార్తలు వచ్చాయి. అయితే భక్తుడి నుంచి తమకు ఎలాంటి వెండి వస్తువులు అందలేదని టీటీడీ అధికారులు విజిలెన్స్‌ అధికారులకు తెలియజేయడంతో వారు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత భక్తుడు ఆ వస్తువులను ఆలయంలోని హుండీలో సమర్పించినట్టు తేలింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 02:09 AM