ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడి

ABN, Publish Date - Nov 25 , 2024 | 02:07 AM

విధుల్లో వున్న పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ కాలర్‌ పట్టుకుని నలుగురు రౌడీలు దాడి చేశారు. మ్యాన్‌ ప్యాక్‌ లాక్కొని దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ నలుగురు గతంలో పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు. వైసీపీకి చెందిన వారు.

ఫ దౌర్జన్యం చేసిన వారు.. పులివర్తి నానీపై హత్యాయత్నం కేసులో నిందితులు

ఫ వీరంతా వైసీపీకి చెందిన వారే!

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 24(ఆంధ్రజ్యోతి): విధుల్లో వున్న పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ కాలర్‌ పట్టుకుని నలుగురు రౌడీలు దాడి చేశారు. మ్యాన్‌ ప్యాక్‌ లాక్కొని దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ నలుగురు గతంలో పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు. వైసీపీకి చెందిన వారు. ఈ ఘటన ఆదివారం ఆర్‌సీ పురం జంక్షన్‌ వద్ద చోటు చేసుకుంది. తిరుపతి రూరల్‌ సీఐ చిన్నగోవిందు తెలిపిన ప్రకారం.. సుండుపల్లికి చెందిన సాయికుమార్‌ కారులో ఆర్‌సీ పురం నుంచి తిరుపతికి వస్తున్నారు. ఆర్‌సీ పురం జంక్షన్‌ దాటుతుండగా చంద్రగిరి నుంచి రేణిగుంటకు వెళుతున్న స్కార్పియో వాహనం డ్రైవరు కారును నిర్లక్ష్యంగా నడిపి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రక్షక్‌ ఆరులో విధుల్లో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ కోదండరామయ్య, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్ళారు. హెడ్‌ కానిస్టేబుల్‌ కోదండరామయ్య ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తూ.. ప్రమాదంలో దెబ్బతిన్న కార్లను పరిశీలిస్తున్నారు. స్కార్పియో వాహనంలో వున్న ఆర్‌సీ పురం మండలం సీ.రామాపురం గ్రామానికి చెందిన ఎస్‌.జయచంద్రారెడ్డి, నెన్నూరుకు చెందిన మునిబాలాజి, తిరుపతికి చెందిన ట్రావెల్‌ బిజినెస్‌ చేస్తున్న ఆర్‌.అన్వర్‌బాషా, తనపల్లికి చెందిన లోకే్‌షరెడ్డి.. హెడ్‌ కానిస్టేబుల్‌ షర్టు పట్టుకుని దాడి చేసి దౌర్జన్యానికి దిగారు. మ్యాన్‌ ప్యాక్‌, మొబైల్‌ ఫోను లాక్కొని కొట్టారు. ఈ ఘటనపై కోదండరాం మ్యాన్‌ ప్యాక్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చిన్నగోవిందు చెప్పారు. ఈ నిందితులపై గతంలో పద్మావతి వర్సిటీ వద్ద పులివర్తి నానిపై (ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే) జరిగిన హత్యాయత్నం కేసులో రౌడీషీట్లు ఉన్నాయని చెప్పారు. వీరంతా వైసీపీకి చెందిన వారు కావడం గమనార్హం.

Updated Date - Nov 25 , 2024 | 02:07 AM