రైల్వే స్టేషనలో క్యాంటెక్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Sep 21 , 2024 | 11:29 PM
అత్యాధునిక క్యాంటెక్ టెక్నాలజీని నంద్యాల రైల్వే స్టేషనలో ఏర్పాటు చేయాలని నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.
నంద్యాల రూరల్, సెప్టెంబరు 21 : అత్యాధునిక క్యాంటెక్ టెక్నాలజీని నంద్యాల రైల్వే స్టేషనలో ఏర్పాటు చేయాలని నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్‌కు ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం నుంచి రాష్ట్రంతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సామాన్య రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నంద్యాల రైల్వే స్టేషనలో సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ మెయింటెనెన్స టెక్నాలజీని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర విభజనతో మౌలిక సదుపాయాల కల్పన, రాష్ట్ర రాజధానికి, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, దేశంలోని ఇతర ప్రాంతాలకు రాయలసీమ నుంచి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య కేంద్రంగా ఉన్న నంద్యాల రైల్వే జంక్షన గుంటూరు, గుంతకల్లు, తిరుపతి వంటి ప్రధాన కోచింగ్ డిపోలలో ట్రాఫిక్ భారాన్ని తగ్గించడంలో నంద్యాల రైల్వే స్టేషనకు ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు శబరి తెలిపారు.
Updated Date - Sep 21 , 2024 | 11:29 PM