నేడు టీటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకారం
ABN, Publish Date - Nov 06 , 2024 | 03:53 AM
BR Naidu , chairman of TTD board of trustees ,Srivari temple.
తిరుమల, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): టీటీడీ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బీఆర్ నాయుడు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు చైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణస్వీకారం చేశాక బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజు, నర్సిరెడ్డి, జాస్తి సాంబశివరావు, రాజశేఖర గౌడ్, జంగా కృష్ణమూర్తి, దర్శన్, శాంతారాం, రామ్మూర్తి, జానకీదేవి, మహేందర్‌రెడ్డి, రంగశ్రీ, ఆనంద్‌సాయి, నరే్‌షకుమార్, అదిత్ దేశాయ్, సౌరభ్ బోరా, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Updated Date - Nov 06 , 2024 | 03:53 AM